పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు ఎదురవుతున్న ఇబ్బందులు త్వరలోనే పరిష్కారం కానున్నాయి. మొగులయ్యకు ఇంటి స్థల సమస్యతో పాటు కంటి చికిత్స బాధ్యతను కూడా స్వయంగా తీసుకుంటానని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హామీ ఇచ్చారు.
Off The Record: తెలంగాణ రాజకీయం మొత్తం… ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలకు ఇది చావో రేవో అన్నట్టుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా…సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, అధికార బలం చూపించాలని కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి. బీఆర్ఎస్ అయితే… సిట్టింగ్ సీట్ అనేకాకుండా… ఈ ఉప ఎన్నికలో గెలిస్తే… తిరిగి తమ బలం పెరిగిందన్న సంకేతాలు పంపడంతో పాటు వలసలు, కేడర్‌లో మనోధైర్యం నింపడం లాంటి చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని భావిస్తోందట.…
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్ల నమోదుపై హైకోర్టులో జరిగిన విచారణ ముగిసింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటు చోరీ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన ప్రత్యేక సమావేశంలో బీఆర్ఎస్ కేటీఆర్ ఓటు చోరీ అంశంపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కౌంటర్ వేశారు. ‘కారు’ గుర్తు ఉన్న పార్టీ (బీఆర్ఎస్) వాళ్ల పరిస్థితిని వాళ్లే చూసుకోవాలని విమర్శించారు. వాళ్ల కారు ఇప్పటికే రిపేర్ చేయడానికి కూడా పనికి రాకుండా షెడ్డులో పడిందని ఎద్దేవా చేశారు. కనీసం సెకండ్ హ్యాండ్లో కూడా కారును కొనడానికి ఎవరూ లేరని బండి విమర్శలు చేశారు. ఈ మేరకు బండి సంజయ్ తన ఎక్స్‌లో పోస్ట్…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కో బూత్‌లో 50 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నట్లు అనుమానం ఉందని తెలిపారు. ఈ సమాచారం ఆయన సొంత దృష్టికి వచ్చినట్టు, నియోజకవర్గంలో తీవ్రమైన ఎన్నికల అవినీతి పరిస్థితులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. గత ఎన్నికల్లో కొన్ని కాంగ్రెస్ నాయకులు కొవ్వూరు కార్తీక్, దీపక్ శర్మ, మాధురి…
KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారాయి. జూబ్లీహిల్స్‌లో మన గెలుపు ఖాయం, మెజార్టీ తెచ్చుకోవడమే మన చేతుల్లో ఉందని తాజాగా జరిగిన సభలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల రోజులు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ చేసిన మోసం ప్రజలకు చెప్పాలని.. కారు, బుల్డోజర్ మధ్య యుద్ధం జరుగుతుందని, రాష్ట్రం అంతా జూబ్లీహిల్స్ వైపు చూస్తోందని ఆయన అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలనే ఆకాంక్ష ప్రజల్లో…
పల్నాడులో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం.. పల్నాడు జిల్లాలో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం రేపుతుంది. వెల్దుర్తి మండలం దావుపల్లి తండాలో గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్య పరీక్షలు చేయగా.. మెలియాయిడోసిస్ వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో రోగి దామావత్ హర్యానాయక్ కు అధికారులు మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే దావుపల్లి తండాకు వెళ్లిన పల్నాడు డీఎంహెచ్ఓ వెళ్లి, ఆ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. రేపు సీఆర్డీఏ…
KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆత్మగౌరవ పోరాటంగా తీసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. జూబ్లీహిల్స్‌లో ప్రచార సభలో మాట్లాడుతూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “పచ్చి జూటా మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు హైడ్రా పేరుతో బుల్డోజర్లతో పాలన చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పుడు నిర్ణయించుకోవాలి — కార్ కావాలా? లేక…
వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నుంచి ఉత్పత్తి ప్రారంభమవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, “మొదటి యూనిట్ ఉత్పత్తి ప్రారంభమైందన్నది సంతోషకర విషయం.