KTR: శంషాబాద్‌లో జరిగిన బీఆర్‌ఎస్ మైనార్టీ నేతల సమావేశంలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలన అనేది బీజేపీతో కుమ్మక్కై నడుస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మైనార్టీలను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ‘మైనార్టీ డిక్లరేషన్’ పేరుతో కాంగ్రెస్ మైనారిటీలను మోసం చేసింది. మైనార్టీల కోసం రూ. 4 వేల కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పి మాట తప్పిందని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ పాలనను సమర్థించుకుంటూ.. మేం కూడా కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు, కానీ భారతదేశంలో మైనార్టీల కోసం కేసీఆర్ చేసినన్ని పనులు ఇంకెవరూ చేయలేదు. ఈ విషయాన్ని ఇతర రాష్ట్రాల్లో అసదుద్దీన్ ఒవైసీ కూడా చెప్పారు.. కానీ ఇక్కడ మాత్రం చెప్పరని వ్యాఖ్యానించారు.
Shreyas Iyer Health Update: ఐసీయూ నుంచి బయటికి వచ్చిన శ్రేయస్ అయ్యర్.. డాక్టర్లు ఏం చెప్పారంటే..!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిలో వైరుధ్యాన్ని కేటీఆర్ ఎత్తిచూపారు. బుల్డోజర్ రాజ్యం నడవదని యూపీపై రాహుల్ గాంధీ విమర్శిస్తారు.. కానీ, ఇక్కడ అదే బుల్డోజర్ రాజ్యం నడుస్తుంటే.. ఆయన సైలెంట్‌గా ఎందుకు ఉన్నారు? హైడ్రా గురించి కూడా రాహుల్ గాంధీ సైలెంట్‌గా ఉంటారని నిలదీశారు. రేవంత్ రెడ్డి, బీజేపీ పార్టీ మధ్య రహస్య ఒప్పందం ఉందని కేటీఆర్ పరోక్షంగా ఆరోపించారు. “చౌకీదార్ చోర్” అని రాహుల్ అంటే, రేవంత్ రెడ్డి మాత్రం కాదు కాదు.. ఆయన నా పెద్దన్న అని చెబుతారని అన్నారు. అలాగే సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు మోడీ జేబు సంస్థలని.. రాహుల్ విమర్శిస్తే, రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తారని అన్నారు. అలాగే రేవంత్ రెడ్డి బంధువుకు కేంద్రంలో కాంట్రాక్టులు వస్తాయి.. దానికి బదులుగా రేవంత్ రెడ్డి కూడా బీజేపీ నేతకు లాభం చేకూరుస్తారని మంది పడ్డారు.
Wife Attacked Husband: ఏందమ్మా ఇది.. భర్త ఇళ్లు క్లీన్ చేయలేదని.. ఆ ఇళ్లాలు ఏం చేసిందో తెలుసా…
అలాగే ప్రధాని మోడీ తెచ్చిన చట్టాలను బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే తొందరగా ఇక్కడ రేవంత్ అమలు చేస్తారని.. బడే భాయ్ కోసం రేవంత్ రెడ్డి చేసిన పని ఇది అంటూ పేర్కొన్నారు. ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్, బీజేపీ కలిసి నడిపిస్తున్న ప్రభుత్వం అని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే మైనార్టీ నేతలకు కాంగ్రెస్‌లో జరుగుతున్న అన్యాయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ లేరు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో కూడా ఒక్క మైనార్టీ నాయకుడిని కూడా ఎన్నుకోలేదు. షబ్బీర్ అలీ, అజారుద్దీన్ లాంటి వారు కూడా కాంగ్రెస్‌కు కనిపించట్లేదా..? అని ప్రశ్నించారు. ముఖ్యంగా అజారుద్దీన్ విషయంలో.. ఎమ్మెల్సీ ఇచ్చినట్లే ఇచ్చి అజారుద్దీన్‌ను పక్కన పెట్టేశారు. క్రికెట్‌లో అజారుద్దీన్ కట్ షాట్‌లు కొడితే, ఇక్కడ అజారుద్దీన్‌నే కట్ చేసేశారు రేవంత్ రెడ్డి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.