KTR: శంషాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ మైనార్టీ నేతల సమావేశంలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలన అనేది బీజేపీతో కుమ్మక్కై నడుస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మైనార్టీలను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ‘మైనార్టీ డిక్లరేషన్’ పేరుతో కాంగ్రెస్ మైనారిటీలను మోసం చేసింది. మైనార్టీల కోసం రూ. 4 వేల కోట్ల బడ్జెట్…
బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటానికి సిద్ధపడింది. ఆటో డ్రైవర్ల సమస్యలే పరిష్కారం దిశగా సోమవారం గులాబీ పార్టీ నేతలు ఆందోళనలు.. నిరసనలకు రెడీ అయ్యారు. సోమవారం హైదరాబాద్ నగర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టనున్నారు. ఆటోల్లో ప్రయాణం చేస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుంటున్నామని, వాటికి శాశ్వత పరిష్కారం కావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రావాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట డివిజన్లో హమాలీ బస్తీ వాసులు నిర్వహించిన బొడ్రాయి పండుగలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. హమాలీ బస్తీ ప్రజలు నేతలకు ఘన స్వాగతం పలికి, బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ పల్లెటూర్లలో…
KTR: తెలంగాణ భవన్లో జరిగిన జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. అలాగే కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిట్టడం తప్పా ఇంకేమీ చేయలేదని ధ్వజమెత్తారు. ఒకవేళ జరగబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే..…
సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆది శ్రీనివాస్… ‘కేటీఆర్.. నువ్వెన్ని పెడబొబ్బలు పెట్టినా ఏం ఉపయోగం లేదు. మా ముఖ్యమంత్రి పైన పిచ్చి పిచ్చిగా వాగినంత మాత్రాన నువ్వు పెద్ద మొగోడివి కావు’ అని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నంత కాలం కేటీఆర్, కేసీఆర్ ఇద్దరు కలిసి తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. ‘మీ బతుకు, నీ అయ్య బతుకు…
KTR : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఘటనలు తెలుగు ప్రజలకు తలవంచుకునే పరిస్థితి తెచ్చాయని ఆయన విమర్శించారు. కేటీఆర్ మాట్లాడుతూ, “ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య జరుగుతున్న పంపకాలు రాష్ట్ర పరువుకు మచ్చలాంటివి. ఐఏఎస్ అధికారులను బలి పశువులుగా మార్చే పరిస్థితి వచ్చింది,”…
బస్తీ దవాఖానను మంగళవారం సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో దానం నాగేందర్ పేరును చేర్చిన అంశాన్ని తీవ్రంగా విమర్శించారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. “దానం నాగేందర్ బీఆర్ఎస్లో ఉన్నారని ఎవరు చెప్పారు? ఏ పార్టీకి చెందుతారో చెప్పే ధైర్యం లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గు లేదు. స్పీకర్ వద్ద అబద్దాలు చెబుతూ, పార్టీ మారలేదని ప్రజలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ శక్తిని సమీకరించింది. నవంబర్ 11న జరగనున్న ఈ కీలక ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు పార్టీ భారీగా ముమ్మర ప్రచారానికి సన్నద్ధమైంది. అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు సహా మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత గోపీనాథ్ ను జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించిన బీఆర్ఎస్, ప్రచారాన్ని మరింత బలోపేతం చేయాలనే…
పార్టీ ఫిరాయింపులపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీపైన తొలి దెబ్బను జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ కొట్టబోతోందని అన్నారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు ఎదురవుతున్న ఇబ్బందులు త్వరలోనే పరిష్కారం కానున్నాయి. మొగులయ్యకు ఇంటి స్థల సమస్యతో పాటు కంటి చికిత్స బాధ్యతను కూడా స్వయంగా తీసుకుంటానని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హామీ ఇచ్చారు.