NVSS Prabhakar : నీతి ఆయోగ్ 10వ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నట్లు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. అయితే 9వ సమావేశానికి హాజరుకాలేదని గుర్తుచేస్తూ, “అప్పుడు ముఖ్యమంత్రి ఎవరినిమిత్తం, ఎందుకోసం గైర్హాజరయ్యారు?” అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. నీతి ఆయోగ్ సమావేశాల ఉద్దేశం రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న దానిపై కేంద్రం నమ్మకం పెట్టుకున్నదని ఆయన అన్నారు. “రెవంత్ రెడ్డి ఫెడరల్ స్పూర్తితో సమావేశంలో…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్, అమెరికా పర్యటన కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఈ పర్యటనలో ఆయన అమెరికాలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా జూన్ 1న డల్లాస్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. దీనికోసం అక్కడి బీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. Airtel vs Jio: ఎంట్రీ లెవల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లో భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో…
కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ కి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని తెలిపింది.
Formula E Scam Case: ఫార్ములా-ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు రెండోసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 28వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో ఏసీబీ పేర్కొంది. మరోవైపు, ఫార్ములా-ఈ కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నాకు నోటీసు ఇచ్చింది అని కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
మన పార్టీ నుంచి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో పండబెట్టి తొక్కే విదంగా ఓడించాలి.. మీ ఆవేశం చూస్తుంటే రాబోయే గద్వాల ఉప ఎన్నికల్లో మనం సామాన్య వ్యక్తిని పెట్టినా గెలుస్తాం అన్నారు.. ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం హామీ అని ఎద్దేవా చేశారు. ఎన్ని రోజులు చూడాలి ఈ కాంగ్రెస్ దరిద్రాన్ని అని అందరూ అడుగుతున్నారు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
KTR : రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను క్యాంపు కార్యాలయంలో పెట్టేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను, బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఘాటు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట, పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. కొందరికి గాయాలు కూడా అయ్యాయి.…
పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. వైసీపీ నేతల హెచ్చరిక! మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అరెస్ట్లతో వైసీపీని అణగదొక్కాలని చూస్తే ప్రజల నుంచి తిరిగుబాటు తప్పదన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్షంపై కక్ష్య పూరితంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. కాకాణిని అదుపులోకి తీసుకోవడంపై నెల్లూరు జిల్లా పోలీసులు అధికారిక ప్రకటన చేయాలని…
Breaking News : బీఆర్ఎస్ పార్టీలో పెరుగుతున్న అంతర్గత కలహాల నడుమ, ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేసీఆర్ను కలిసేందుకు ఎర్రవల్లి ఫాం హౌస్కి వెళ్లినట్లు సమాచారం. ఈ భేటీలో కవిత లేఖతో పాటు, ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై వచ్చిన నోటీసుల అంశాలను చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం…
Sama Ram Mohan Reddy : తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ లోపలి కలహాలు ముదిరిపోతున్న నేపథ్యంలో పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ విషయాన్ని పది రోజుల క్రితమే తాను ఊహించానని ఆయన స్పష్టం చేశారు. ఈ లేఖ వెనుక ఉన్న అసలైన కుట్రలు ఇప్పుడు బయటపడుతున్నాయని ఆరోపించారు. కవితను సస్పెండ్ చేయడానికి ఇప్పటికే స్కెచ్ వేసిన బృందం పని చేస్తోందని, సంతోష్ రావు, కేటీఆర్,…
TPCC Mahesh Goud : ఎమ్మెల్సీ కవిత మాజీ సీఎం కేసీఆర్కు రాసిన లేఖ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇంట్లో కుంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమతం అవుతున్నాడని, ఎకు మేకై మరో పవర్ సెంటర్ రావడంతో మతిభ్రమించి, రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ మాట్లాడారని ఆయన మండిపడ్డారు. కవిత…