Maganti Gopinath : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మాదాపూర్‌లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర, జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు సాగింది. ఈ సందర్భంగా మాదాపూర్ నీరూస్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నెంబర్ 45, ఫిల్మ్‌నగర్ వంటి ప్రధాన ప్రాంతాల గుండా యాత్ర సాగింది.
BC Janardhan Reddy: ఓటు అనే ఆయుధంతో ప్రజలే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు.. మంత్రి కీలక వ్యాఖ్యలు..!
అంతిమయాత్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాగంటి పాడెను స్వయంగా మోస్తూ గౌరవం తెలిపారు. అభిమానులు తమ నాయకుడిని చివరిసారి చూడాలని భారీగా తరలివచ్చారు. ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో మాగంటి గోపినాథ్ అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి.
ఈ నెల 5వ తేదీన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన మాగంటి గోపినాథ్, ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సీఎం వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు కూడా మాగంటి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మంత్రి నారా లోకేశ్, నారా బ్రాహ్మణి సహా పలువురు ప్రముఖులు మాగంటికి శ్రద్ధాంజలి ఘటించారు. మాగంటి గోపినాథ్ ఆకస్మిక మృతితో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో దిగ్భ్రాంతి నెలకొంది. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు నాయకులు, ప్రజలు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలిపారు.
AP EAPCET 2025 Results: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2025 ఫలితాలు విడుదల..!