Bhatti Vikramarka Pays Tribute to Suravaram Sudhakar Reddy: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివ దేహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళి అర్పించారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌కు వెళ్లిన భట్టి.. సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజల కోసం ఆయన చేసిన సేవలను డిప్యూటీ సీఎం గుర్తు చేసుకున్నారు. మనం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయాం అని అన్నారు. చిన్న నాటి నుంచి ప్రజల పక్షాన నిలబడి.. ప్రజల కోసం పోరాడారన్నారు. సురవరం రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శం అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ… ‘గొప్ప నాయకుడిని కోల్పోయాం. సురవరం సుధాకర్ రెడ్డికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. విద్యార్థి దశ నుంచి ఆయన పోరాడారు. దేశంలో సీపీఐ బలోపేతం కోసం కృషి చేశారు. చిన్న నాటి నుంచి ప్రజల పక్షాన నిలబడి.. ప్రజల కోసం పోరాడారు. తను చివరి వరకు ప్రజల కోసం నిలబడ్డారు. వారి రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శం. సురవరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మా ముఖ్యమంత్రి చెప్పినట్టు కేబినెట్లో తీర్మానం చేసి వారు చిరస్థాయిగా నిలిచేలా నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు.
Also Read: KTR: దమ్ముంటే ఆ 10 నియోజకవర్గాల్లో రాజీనామా చేయండి.. కాంగ్రెస్‌కు కేటీఆర్ సవాల్!
సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. ‘జాతీయ స్థాయిలో అనేక హోదాల్లో సుధాకర్ రెడ్డి పని చేశారు. ఎన్నో విప్ల ఉద్యమాలు, ఎన్నో ప్రజా ఉద్యమాల్లో, కార్మిక ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. చిరస్మరినియమైన మహనీయుడు సురవరం సుధాకర్ రెడ్డి. సుధాకర్ రెడ్డి మరణం ఆవేదనకు గురిచేసింది. విద్యార్ది నాయకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. జాతీయస్థాయిలో ఏడెండ్ల పాటు పని చేశారు.ప్రజల పట్ల.. ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. అన్ని ప్రజా సమస్యలపై క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రజా ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి బాధాకరం. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి మద్దతు తెలిపింది. జాతీయ స్థాయిలో మాతో కలిసి పని చేసే అవకాశం కలిసి పని చేశారు. కేసీఆర్ కూడా సుధాకర్ రెడ్డి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. మా పార్టీ తరఫున, కేసీఆర్ తరుపున సురవరం కుటుంబ సభ్యులకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము’ అని కేటీఆర్ తెలిపారు.