KTR : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, “ప్రజలు బీఆర్ఎస్‌ను పక్కనబెట్టి, బీజేపీ–కాంగ్రెస్‌లకు చెరో ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చారు. కానీ ఇన్ని నెలలుగా 16 మంది ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారు? ఒక్క రూపాయి కూడా రాలేదు” అని విమర్శించారు.
స్టన్నింగ్ లుక్స్, అప్డేటెడ్ ఫీచర్స్తో Renault Kiger Facelift లాంచ్.. ధర ఎంతంటే?
రేవంత్ రెడ్డి బీజేపీ రక్షణ కవచంలోనే ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. “రేవంత్ చేసే ప్రతీ తప్పును బీజేపీ ఎంపీలు కాపాడుతున్నారు. ఢిల్లీలో రేవంత్ బావమరిదిని బీజేపీ రక్షిస్తే, ఇక్కడ బీజేపీ ఎంపీకి రేవంత్ భారీ రోడ్డు కాంట్రాక్టు ఇచ్చాడు. దీంతో మోడీ, రేవంత్ ఇద్దరూ ఒక్కటే.. ఒకరు ‘బడే భాయ్’, మరొకరు ‘ఛోటే భాయ్’” అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీపై కూడా కేటీఆర్ వ్యంగ్యం వేశారు. “మధ్యలో రాహుల్ గాంధీ ఆటలో అరటిపండు అయ్యాడు. రాహుల్ భవిష్యత్తు కూడా రేవంత్ వల్లే ప్రమాదంలో పడుతుంది” అని వ్యాఖ్యానించారు.
“ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై మోడీ ఈడీని వదిలిస్తే, రేవంత్ సీబీఐని పంపిస్తున్నాడు” అని ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితిని ప్రస్తావిస్తూ, యూరియా కోసం వారు అరిచే స్థితికి చేరుకున్నారని చెప్పారు. “ఎరువుల కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో నిలబడుతున్నారు. గోదావరి నీళ్లు తెలంగాణకు వద్దని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ కిందనున్న ఆంధ్రా, తమిళనాడుకు మాత్రం నీళ్లు ఇస్తామని చెబుతున్నారు” అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
స్టన్నింగ్ లుక్స్, అప్డేటెడ్ ఫీచర్స్తో Renault Kiger Facelift లాంచ్.. ధర ఎంతంటే?