CM Revanth Reddy: లక్ష కోట్ల ఆస్తి ఎలా కేసీఆర్?.. ఆ టెక్నిక్ ఏందో తెలంగాణ యువతకు చెప్పండి!
- ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేటీఆర్ లెక్కలు వేస్తున్నాడు
- నేను ఢిల్లీకి ఎందుకుపోతున్నానంటే?
- లక్ష కోట్ల ఆస్తి ఎలా కేసీఆర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ లెక్కలు వేస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తాను ఢిల్లీకి పోయేది.. మాజీ సీఎం కేసీఆర్ తెచ్చిన 11.5 వడ్డీ రేటును 7.25కి కుదించడానికే వెళ్లాలని స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన అప్పుల చరిత్ర కూడా అందరికీ తెలియాలన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాళేశ్వరం కోసం రూ.87,449 కోట్లు అప్పు తెచ్చారన్నారు. 11.5 వడ్డీతో 14 ఏళ్లకు కేసీఆర్ అప్పు తెచ్చాడని.. యూబీఐ, నాబార్డు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల కట్టారన్నారు. అసలు, వడ్డీలు కలిపి ఇప్పటివరకు రూ.49,835 కోట్లు చెల్లించామని.. ఇంకా రూ.60,769 కోట్లు చెల్లించాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
‘నేను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేటీఆర్ లెక్కలు వేస్తున్నాడు. ఢిల్లీకి నేను ఎందుకు పోతున్నా. కేసీఆర్ తెచ్చిన 11.5 వడ్డీ రేటు 7.25కి కుదించడం జరిగింది. ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలకు బిగ్ బ్రదర్. జెండా అజెండా వేరు. కానీ ఆయన ప్రధాని.. మనకు కావాల్సిన నిధులు తెచ్చుకోవడానికి భేషజాలు ఎందుకు. ఇతర దేశాలకు ఎందుకు వెళుతున్నా.. పెట్టుబడి దారులను కలవడానికే. పరిశ్రమలు పెట్టండి అని అడిగితే తప్పేంటి?. ప్రధానిని కలిస్తే తప్పా?. 14 ఏళ్లు కట్టాల్సిన డబ్బులు.. 30 ఏళ్లు కడతా అని ఒప్పించుకున్నా. 13 వేల కోట్లు నాకు ఏడాదికి మిగులుతాయి’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Also Read
Also Read: CM Revanth Reddy: అక్బరుద్దీన్.. నాతో మజాక్ చెయ్, ప్రభుత్వంతో వద్దు!
‘వందల ఎకరాల ఫామ్ హౌస్‌లు, పేపర్లు, టీవీలు ఎక్కడి నుంచి వచ్చాయి. లక్ష కోట్ల ఆస్తి ఎట్లా వస్తుంది. ఆ టెక్నిక్ ఏందో చెప్పండి కాస్త తెలంగాణ యువతకు. మీ పిల్లలకే ఆ నైపుణ్యం ఎలా వచ్చింది?. సీఈ దగ్గరే వందల కోట్లు ఉంటే.. సీఎం దగ్గర ఆస్తి ఎంత ఉంది అని బీజేపీ ఎమ్మెల్యే అడుగుతున్నాడు. మా దగ్గర కొలిచేందుకు టేపు లేదు.. అందుకే విచారణ కమిషన్. కాళేశ్వరం నిర్మాణంలో కేసీఆర్, హరీష్ రావుల అవినీతి దుర్మార్గాలను చూస్తూ కూర్చున్నాడు ఈటల రాజేందర్. ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి కాళేశ్వరం అంశంలో ఈటల కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!