నాజూకు నడుము భామలు ఒక్కసారిగా లావైపోతే అస్సలు బాగోదు. కానీ ఏం చేస్తాం… ‘స్టోరీ డిమాండ్ చేసింది’ అంటూ కొందరు అందాల ముద్దుగుమ్మలు కథ కోసం కేజీల కొద్ది బరువు పెరిగేశారు. 2015లో వచ్చిన ‘సైజ్ జీరో’ కోసం అనుష్క అదే పనిచేసింది. సన్నగా కనిపించాల్సిన సన్నివేశాల్లో మొదట నటించేసి, ఆ తర్వాత పాత్ర కోసం విపరీతంగా లావైపోయింది. ఇప్పటికీ మనుపటి శరీరాకృతిని అనుష్క పొందలేకపోయింది. కానీ చిత్రంగా భూమి పెడ్నేకర్ మాత్రం ఆ విషయంలో సక్సెస్…
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “మిమి”. సరోగసి డ్రామాగా రూపొందనుతున్న ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, సాయి తమంకర్, సుప్రియా పాథక్, మనోజ్ పహ్వా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. లక్ష్మణ్ ఉతేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్ లపై దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. ఈ సరికొత్త జోనర్ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను ఈరోజు రిలీజ్ చేశారు మేకర్స్. Read Also :…
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరోగసి డ్రామా విడుదలకు సిద్ధంగా ఉంది. నిన్న ఈ చిత్రానికి సంబంధించి కృతి సనన్ ఫస్ట్ లుక్ విడుదల కాగా, నేడు మరో అప్డేట్ ను అందించారు మేకర్స్. జూలై 13న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాబోతోందని తెలుపుతూ ఓ టీజర్ ను విడుదల చేశారు. అందులో కృతి సనన్ ప్రెగ్నెన్సీ జర్నీని చూపించారు. అంతా అనుకుంటున్నట్లుగా కాకుండా ఎదో స్పెషల్ గా ఉంటుందని హామీ…
నోటి దాకా వచ్చిన ముద్ద నోట్లోకి వెళ్లకపోవటం అంటే ఏంటో… పాపం నోరాకి తాజాగా తెలిసి వచ్చిందంటున్నారు… బాలీవుడ్ జనాలు! ఆమె నోటిదాకా వచ్చిన ఓ ముద్దొచ్చే క్యారెక్టర్ చివరి నిమిషంలో చేజారిపోయిందట! ఇంతకీ, విషయం ఏంటంటే…టైగర్ ష్రాఫ్ టైటిల్ రోల్ లో దర్శకుడు వికాస్ బాల్ ‘గణ్ పత్’ అనే సినిమా రూపొందించబోతున్నాడు. రెండు భాగాలుగా ఈ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ వన్ అండ్ టూ రెండిట్లోనూ కృతీ సనోన్ హీరోయిన్ గా…
ఈ ఏడాది డబ్బూ రత్నాని క్యాలెండర్ షూట్ లో పలువురు ప్రముఖ నటీనటులు మెరిసిన విషయం తెలిసిందే. తాజాగా పొడుగు కాళ్ళ సుందరి కృతి సనన్ డబ్బూ రత్నాని ఫోటోషూట్ లో హాట్ గా కన్పించి హీట్ పెంచేసింది. ఇందులో మొత్తం బ్లాక్ దుస్తులు ధరించింది. కృతి సనన్ ఫాక్స్ లెదర్ ఫ్యాషన్ ప్యాంటు, ఆఫ్-షోల్డర్ క్రాప్ టాప్ లో, బ్లాక్ నెయిల్ పాలిష్, వేళ్ళకు ఉంగరాలతో ఉన్న ఈ పిక్ వైరల్ అవుతోంది. ఇక ఈ…
టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ బాలీవుడ్ లోకి రీమేక్ అవుతుందన్న వార్తలు వినిపిస్తూనే వున్నా ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఈ తెలుగు సినిమా రీమేక్ లో నటించడానికి కార్తీక్ ఆర్యన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కథానాయికగా నటించనుందట. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం బడా నిర్మాతలు పోటీపడుతున్నారు. అయితే ఇటీవలే ఓ నిర్మాత అల్లు అరవింద్ ను కలిసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు…
బాలీవుడ్ భామ కృతి సనన్ ఓంరౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రభాస్ కు జంటగా ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తుంది. గతంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలో కథానాయికగా పరిచయమైంది ఈ బ్యూటీ. తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని ఉందని పేర్కొంది. తను మొదటిసారిగా కలిసి నటించిన వ్యక్తి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ను లాక్ డౌన్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ను ముందుగా ముంబైలో జరపాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల భారీగా కేసులు పెరిగిపోతుండడంతో మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించారు. దీంతో ఇటీవలే ‘ఆదిపురుష్’ షూటింగ్ ను హైదరాబాద్ కు మార్చారు మేకర్స్. హైదరాబాద్ లో సినిమా షూటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ తెలంగాణలో తాజా పరిణామాలు…