బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “మిమి”. సరోగసి డ్రామాగా రూపొందనుతున్న ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, సాయి తమంకర్, సుప్రియా పాథక్, మనోజ్ పహ్వా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. లక్ష్మణ్ ఉతేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్ లపై దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. ఈ సరికొత్త జోనర్ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను ఈరోజు రిలీజ్ చేశారు మేకర్స్.
Read Also : షూటింగ్ ప్రారంభించిన నాగశౌర్య
ట్రైలర్ లో ముఖ్యమైన పాత్రలను చూపించిన మేకర్స్ కృతి సరోగసి తల్లిగా మారడానికి ఎలా ఒప్పుకుంది? ఎందుకు ? కొన్ని వారాల తరువాత అబార్షన్ చేయించుకోమని ఆ బిడ్డ తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది ? ఇదంతా చూసిన ఆమె తల్లిదండ్రుల రియాక్షన్ ఏంటి ? అనే విషయాలను ఫన్ తో పాటు భావోద్వేగాలను మిళితం చేసి ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ లో విజువల్స్, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే కొత్తదనంతో అలరిస్తానంటూ కృతి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టుగానే కన్పిస్తోంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగానే పెంచేసింది. జూలై 30న ఈ చిత్రం జియో సినిమా, నెట్ ఫ్లిక్స్ ఇండియాలో విడుదల కానుంది.