యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎట్టకేలకు తొలి బాలీవుడ్ చిత్రం “ఆదిపురుష్” షూటింగ్‌ను ముగించాడు. ముంబైలోని సెట్‌లో కేక్ కట్ చేసి చిత్ర యూనిట్ ఈ వేడుకను జరుపుకుంది. ప్రభాస్ తన పార్ట్‌ను పూర్తి చేయడంతో బ్యాలెన్స్ టాకీ పార్ట్‌లను నవంబర్‌లో చిత్రీకరించనున్నారు. ఇప్పటికే చిత్ర కథానాయిక కృతి సనన్ ఒక వారం క్రితం తన భాగం షూటింగ్ ముగించింది. సైఫ్ అలీ ఖాన్ కూడా చిత్రీకరణను పూర్తి చేశారు. వచ్చే ఏడాది వేసవి వరకు వీఎఫ్‌ఎక్స్…
యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న పౌరాణిక చిత్రం “ఆదిపురుష్”. తాన్హాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి సనన్, సన్నీ సింగ్, దేవదత్తా నాగే, సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు. ఆదిపురుష్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. 300-400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రభాస్ దాదాపు 100…
‘వన్’ ఒక్కడినే తో తెలుగువారికి సుపరిచితమై ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది కృతి సనన్. ‘మిమి’ విజయంతో విజయపథంలో దూసుకుపోతోంది. ప్రస్తుతం రాజ్‌కుమార్ రావ్ తో కలసి ‘హమ్ దో హమారే దో’ అనే కామెడీడ్రామాలో నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 29 న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే కొంతకాలంగా ఇంటి వేటలో ఉంది కృతి. తాజాగా ఆ ప్రయత్నంలో సక్సెస్ అయింది. కృతి ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్…
ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్టులలో ‘ఆదిపురుష్’ కూడా ఒకటి. రామాయణం ఆధారంగా అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతునన్న ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపించనున్నారు. దర్శకుడు ఓం రౌత్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ కృతి సనన్ కూడా తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసింది. దర్శకుడు…
రాజ్ కుమార్ రావ్, కృతీసనన్ జంటగా నటించిన సినిమా ‘హమ్ దో హమారే దో’. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా టీజర్ బుధవారం విడుదలైంది. అభిషేక్ జైన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 29న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. గతంలో ‘స్త్రీ’, ‘లూకా చుప్పి, బాలా, మిమి’ చిత్రాలను నిర్మించిన మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ సంస్థ దీన్ని ప్రొడ్యూస్ చేసింది. ఈ చిత్రంలో పరేశ్…
మహేశ్ బాబు ‘వన్.. నేనొక్కడినే’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయింది. ‘రాబ్తా’, ‘బరేలి కి బర్ఫీ’, ‘స్ట్రీ’, ‘లుకా చుప్పి’, ‘కళంక్’, ‘పానిపట్’, ‘హౌస్ ఫుల్4’ వంటి సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా ‘మిమి’ సినిమాతో సూపర్ స్టార్ హీరోయిన్ అయింది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా కృతి ఇమేజ్ ని ఆకాశమంత ఎత్తుకు…
కృతీ సనన్ తన అందమైన ఆకృతితో ఇప్పటికే కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసేసింది. అయితే, కేవలం గ్లామర్ కే పరిమితం కావటం లేదు గార్జియస్ బ్యూటీ. ఆ మధ్య ‘పానీపట్’ మూవీలో మరాఠా మహారాణిగా అలరించింది! ఈ మధ్యే ‘మిమి’ సినిమాలో అద్దె గర్భంతో ప్రెగ్నెంట్ గా సూపర్ పర్ఫామెన్స్ ప్రదర్శించింది. గ్లామర్, నటన రెండూ బ్యాలెన్స్ చేస్తోన్న కృతీ నెక్ట్స్ ‘ఆదిపురుష్’లో సీతమ్మగా దర్శనం ఇవ్వబోతోంది! అయితే, ఒకవైపు ప్రభాస్ సరసన పౌరాణికం చేస్తోన్న టాలెంటెడ్…
టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని “మిమి” సినిమా రివ్యూ ఇచ్చేసింది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విభిన్నమైన చిత్రంలో పంకజ్ త్రిపాఠి, కృతి సనన్ లతో పాటు సుప్రియ పాథక్, సాయి తంఖంకర్, మనోజ్ పహ్వా, జయ భట్టాచార్య కూడా కీలక పాత్రల్లో కన్పించారు కన్పించారు. జూలై 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా సినిమాను వీక్షించిన సమంత “మిమిలో కృతి సనన్ మీరు చాలా అద్భుతంగా నటించారు.…
ఆస్కార్ విజేత ఎ. ఆర్. రెహమాన్ స్వరపరచగా సింగర్ అనన్య బిర్లా పాడిన ‘హిందుస్తానీ వే’ గీతం భారత్ తరఫున ఒలింపిక్ క్రీడల కోసం టోక్యో వెళ్ళిన క్రీడాకారుల పెదాలపై విశేషంగా నానుతోంది. అంతేకాదు… ఇండియన్ స్పోర్ట్స్ పర్శనాలిటీస్ పై చిత్రీకరించిన ఈ గీతానికి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. చిత్రం ఏమంటే… దేశభక్తిని, క్రీడాస్ఫూర్తిని మిళితం చేస్తూ సాగే ఈ పాటకు మించిన స్పందన నాలుగు రోజుల క్రితం విడుదలైన రెహ్మాన్ మరో సాంగ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ హిందీలో ‘షహజాదా’గా రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇక్కడ అల్లు అర్జున్, పూజా హెగ్డే పోషించిన పాత్రలను హిందీలో కార్తీక్ ఆర్యన్, కృతీ సనన్ పోషించబోతున్నారు. పరేశ్ రావెల్, మనీషా కొయిరాలా సైతం కీలక పాత్రలకు ఎంపికైనట్టు తెలుస్తోంది. వరుసగా రెండు పెద్ద బ్యానర్స్ నుండి కార్తీక్ ఆర్యన్ ను తప్పించిన నేపథ్యంలో ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్ ఆఫర్ రావడం అందరినీ…