ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రీమేక్ ల హావా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో తమ నేటివిటీకి తగ్గట్లు మార్చుకొని విజయాలను అందుకుంటున్నారు స్టార్ హీరోలు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ మూవీస్ పై బాలీవుడ్ కన్ను పడింది. టాలీవుడ్ లో హిట్ అయిన అర్జున్ రెడ్డి, జెర్సీ చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అయినా సంగతి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురంలో’ చితం బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. బాలీవుడ్ కుర్రహీరో కార్తీక్ ఆర్యన్, బన్నీ పాత్రలో నటిస్తుండగా పూజా హెగ్డే పాత్రలో కృతి సనన్ నటిస్తోంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల దర్శకుడు రోహిత్ ధావన్, హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ” కార్తీక్ తో కలిసి పనిచేయడం బావుంది” అంటూ తెలిపాడు. ఇక ఈ ఫోటోపై టబు స్పందిస్తూ ‘ఇది చాలా మంచి సినిమా.. జాగ్రత్తగా రీమేక్ చేయాలి’.. అని కామెంట్ చేసింది. టబు కామెంట్ కి కార్తీక్ రీ కామెంట్ చేస్తూ ‘మీ సినిమా కాబట్టే ఎక్కువ ప్రేమతో చేస్తున్నాము’ అని చెప్పుకొచ్చాడు. ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో టబు, అల్లు అర్జున్ తల్లి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/CXq3LBYNxS6/