యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న పౌరాణిక చిత్రం “ఆదిపురుష్”. తాన్హాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి సనన్, సన్నీ సింగ్, దేవదత్తా నాగే, సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు. ఆదిపురుష్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. 300-400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రభాస్ దాదాపు 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. రెట్రోఫిల్స్‌తో కలిసి సంగీత దిగ్గజం టి-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. “ఆదిపురుష్”కి సౌండ్‌ట్రాక్‌ని సాకేత్ పరంపర కంపోజ్ చేస్తున్నారు. భారీ వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ తో 3డిలో తెరకెక్కుతున్న “ఆదిపురుష్” పోస్ట్-ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించే ముందు దర్శకుడు ఓం రౌత్ షూటింగ్ త్వరగా పూర్తి చేయాలనీ భావిస్తున్నారు. “ఆదిపురుష్”లోని గ్రాఫిక్స్‌లో “బాహుబలి” సిరీస్ కంటే ట్రిపుల్ వీఎఫ్‌ఎక్స్ ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. అందుకే సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Read Also : “ఆర్సీ15” షూటింగ్ అప్డేట్… ముంబైలో చరణ్
తాజాగా “ఆదిపురుష్” షూటింగ్ 100 రోజులు పూర్తి చేసుకుంది. ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ మరొకొన్ని వారాల్లోనే పూర్తి కానుంది. ఇప్పటికే కృతి సనన్, సైఫ్ అలీఖాన్ తమ పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసేశారు. గత వారం ప్రభాస్ కు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడం ప్రారంభించారు మేకర్స్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2022 ఆగస్ట్ 8న విడుదల కానుంది.