కృతీ సనన్ తన అందమైన ఆకృతితో ఇప్పటికే కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసేసింది. అయితే, కేవలం గ్లామర్ కే పరిమితం కావటం లేదు గార్జియస్ బ్యూటీ. ఆ మధ్య ‘పానీపట్’ మూవీలో మరాఠా మహారాణిగా అలరించింది! ఈ మధ్యే ‘మిమి’ సినిమాలో అద్దె గర్భంతో ప్రెగ్నెంట్ గా సూపర్ పర్ఫామెన్స్ ప్రదర్శించింది. గ్లామర్, నటన రెండూ బ్యాలెన్స్ చేస్తోన్న కృతీ నెక్ట్స్ ‘ఆదిపురుష్’లో సీతమ్మగా దర్శనం ఇవ్వబోతోంది! అయితే, ఒకవైపు ప్రభాస్ సరసన పౌరాణికం చేస్తోన్న టాలెంటెడ్ బ్యూటీ తన ఫస్ట్ బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో కలసి డేర్ డెవిల్ స్టంట్స్ కూడా చేయబోతోంది!
ఎపిక్ స్టోరీతో రూపొందుతోన్న ‘ఆదిపురుష్’తో పాటూ కృతీ ఖాతాలో ప్రస్తుతం యాక్షనర్ ‘గణ్ పత్’ కూడా ఉంది. టైగర్ ష్రాఫ్ హీరోగా ‘క్వీన్’ డైరెక్టర్ వికాస్ బాల్ రూపొందించబోతోన్న ఈ సినిమాలో కృతీ బైక్ రేసింగ్ తో ఆకట్టుకుంటుందట! పైగా డర్ట్ బైకింగ్ సీక్వెన్స్ తో సత్తా చాటబోతోందట! ఇప్పటికే ఆమె బైక్ పైన కూర్చుని ఉన్న ఫస్ట్ లుక్ విడుదలైంది కూడా! అది నెటిజన్స్ కు బాగానే నచ్చింది. కానీ, బైక్ తో ఫోజు ఇవ్వటంతో సరిపోదు కదా… డర్ట్ బైకింగ్ ట్రైనింగ్ ప్రారంభించింది కృతీ! ‘ఆదిపురుష్’ సినిమా నుంచీ ఎప్పుడు బ్రేక్ దొరికితే అప్పుడు ‘గణ్ పత్’ కోసం బైక్ ఎక్కేస్తోందట బక్క పల్చటి బ్యూటీ!
డర్ట్ బైకింగ్ అంటే దుమ్ముధూళీలో, ఎత్తుపల్లాల్లో… బైక్ డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. క్యూట్ బేబ్ కృతీ ఎలా ఆ సాహసాలు చేస్తుందో చూడాలి మరి!