‘వన్’ ఒక్కడినే తో తెలుగువారికి సుపరిచితమై ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది కృతి సనన్. ‘మిమి’ విజయంతో విజయపథంలో దూసుకుపోతోంది. ప్రస్తుతం రాజ్‌కుమార్ రావ్ తో కలసి ‘హమ్ దో హమారే దో’ అనే కామెడీడ్రామాలో నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 29 న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే కొంతకాలంగా ఇంటి వేటలో ఉంది కృతి. తాజాగా ఆ ప్రయత్నంలో సక్సెస్ అయింది. కృతి ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటిలో పాగా వేసింది.
Read Also : ‘లైగర్” హీరోయిన్ ఇంటిపై ఎన్సీబీ దాడులు
అమితాబ్ కి చెందిన అంధేరిలోని డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ ను కృతి ప్రస్తుతానికి అద్దెకు తీసుకుంది. త్వరలో ఆక్కడకు మకాం మార్చనుందట. బిగ్ బి లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్ విలువ 31 కోట్లట. అంధేరిలో అట్లాంటిస్ భవనం 27, 28 అంతస్తులో ఈ డూప్లెక్స్ ఉన్నట్లు సమాచారం. ఈ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో కృతి దీపావళి పండగను జరుపుకోనుంది. ఇదిలా ఉంటే కృతి ప్రస్తుతం ‘భేదియా, ఆదిపురుష్, బచ్చన్ పాండే, గణపత్’ వంటి సినిమాలలో నటిస్తోంది.