చిత్రసీమలో కొన్ని బంధాలు, అనుబంధాలు చూస్తే ఏనాటివో అనిపించక మానదు. హీరో కృష్ణ, నటదర్శకనిర్మాత ఎమ్.బాలయ్య బంధం అలాంటిదే! ఇక కృష్ణ, జయప్రద జోడీ కూడా ప్రత్యేకమైనదే- ఎందుకంటే కృష్ణ సరసన విజయనిర్మల తరువాత అత్యధిక చిత్రాలలో నాయికగా నటించిన క్రెడిట్ జయప్రదకే దక్కింది. ఇలా అనుబంధం ఉన్న వీరి కలయికలో ‘ఈ నాటి బంధం ఏ నాటిదో’ అనే చిత్రం తెరకెక్కింది. అమృతా ఫిలిమ్స్ పతాకంపై ఎమ్.బాలయ్య నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్.ఆర్.దాస్ దర్శకుడు. 1977…
నటశేఖర కృష్ణ హీరోగా దర్శకుడు కె.ఎస్.ఆర్. దాస్ తెరకెక్కించిన అనేక చిత్రాలు మాస్ ను విశేషంగా అలరించాయి. ఆ కోవకు చెందిన చిత్రమే ‘హంతకులు – దేవాంతకులు’. ఎస్.ఆర్.కంబైన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం 1972 జూన్ 2న విడుదలై జనాన్ని ఆకట్టుకుంది. ‘హంతకులు – దేవాంతకులు’ కథ ఏమిటంటే – రాజేశ్ సి.ఐ.డి. – అచ్చు అతనిలాగే ఉండే అతని అన్నను, అతని తల్లిని బలరామ్, లైలా, ప్రేమ్ అనే దుండగులు చంపేసి, డబ్బు దోచుకుంటారు.…
సూపర్ కృష్ణ 80వ పుట్టినరోజు నేడు. గతంలో ఆయన పుట్టినరోజు అంటే అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు. సహజంగా వేసవి కాలంలో కృష్ణ ఊటీలో ఉండేవారు. తన సినిమాల షూటింగ్స్ ను అక్కడే ప్లాన్ చేసుకునేవారు. దాంతో రాష్ట్రం నలుమూలల ఉండే అభిమానులంతా మే 31వ తేదీకి ఊటికి చేరుకుని కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొని వచ్చేవారు. ఇక కెరీర్ కు ఆయన ఫుల్ స్టాప్ పెట్టి హైదరాబాద్ లోని నానక్…
తెలుగు చిత్రసీమలో మాస్ హీరోగా తనదైన బాణీ పలికించిన కృష్ణ ‘హీరో’ కృష్ణగా, నటశేఖర కృష్ణగా, ఆ పై సూపర్ స్టార్ కృష్ణగా సాగారు. తెలుగునాట 325 పై చిలుకు చిత్రాల్లో నటించిన నటునిగా ఓ రికార్డ్ సాధించారు. తెలుగు సినిమా రంగానికి సాంకేతికంగా సినిమాస్కోప్, టెక్నికలర్ వంటి అంశాలను అందించిన ఘనత కూడా కృష్ణ సొంతం. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, ఎడిటర్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు కృష్ణ. ఆయన నటవారసునిగా మహేశ్ బాబు…
నటశేఖర కృష్ణ నటించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రం తెలుగు సినిమా రంగానికి కౌబోయ్ మూవీస్ ను పరిచయం చేసింది. ఆ సినిమా విజయంతో కృష్ణ మాస్ హీరోగా జనం మదిలో నిలిచారు. ఆ తరువాత కృష్ణ హీరోగా అనేక కౌబోయ్ తరహా చిత్రాలు రూపొందాయి. అయితే ఏవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’ స్థాయి విజయాన్ని చవిచూడలేదు. కానీ, కృష్ణ అభిమానగణాలు పెరగడానికి ఈ తరహా చిత్రాలు దోహదపడ్డాయి. అలాంటి వాటిలో ‘మావూరి మొనగాళ్ళు’ కూడా చోటు చేసుకుంది. ఈ…
(ఏప్రిల్ 19న ‘అంతా మన మంచికే’కు 50 ఏళ్ళు) మహానటి, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ 1953లోనే ‘చండీరాణి’తో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టారు. ఆ తరువాత దాదాపు 19 ఏళ్ళ వరకు ఆమె దర్శకత్వం ఊసు ఎత్తలేదు. 1972లో స్వీయ దర్శకత్వంలో తమ భరణీ పిక్చర్స్ పతాకంపై ‘అంతా మన మంచికే’ అనే చిత్రాన్ని నిర్మించి, నటించారు భానుమతి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం భానుమతి నిర్వహించారు. ఈ సినిమాలో కృష్ణ…
(ఏప్రిల్ 9న ‘డాక్టర్ – సినీయాక్టర్’కు 40 ఏళ్ళు) తాను అభిమానించే వారినే ఎవరైనా ఆదర్శంగా తీసుకుంటారు. ఓ దశకు వచ్చాక వారితోనే పోటీపడాలనీ ఆశిస్తారు. ఎందుకంటే, తన ఆదర్శమూర్తితో తాను సరితూగాలని ప్రతి అభిమానికీ అభిలాష ఉంటుంది. అలాంటి కోరికతోనే హీరో కృష్ణ చిత్రసీమలో అడుగు పెట్టారు. చిన్నతనంలో తాను ఎంతగానో అభిమానించిన మహానటుడు యన్టీఆర్ తో కలసి నటించారాయన. ఆ సంతోషం చాలక, రామారావు సినిమాలు విడుదలయ్యే సమయంలోనే తన చిత్రాలనూ రిలీజ్ చేసి…
నటశేఖర కృష్ణ నటించిన విజయవంతమైన చిత్రాల్లో ‘అత్తలూ కోడళ్ళు’ ఒకటి. కృష్ణ సరసన వాణిశ్రీ జంటగా నటించిన ‘అత్తలూ కోడళ్ళు’జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ రోజుల్లో చిన్న నిర్మాతలకు, కొత్త వారికి అచ్చివచ్చిన హీరో కృష్ణ.. నంద్యాలకు చెందిన కె.సుబ్బిరెడ్డి, ఎన్. సుబ్బారాయుడు, జె.ఎ.రామసుబ్బయ్య శెట్టి కలసి ‘నందినీ ఫిలిమ్స్’ నెలకొల్పి తొలి ప్రయత్నంగా ‘అత్తలూ-కోడళ్ళు’ చిత్రాన్ని నిర్మించారు… పి.చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. తమ సంస్థ పేరు ‘నందినీ ఫిలిమ్స్’ కాబట్టి, నంద్యాల సమీపంలో…