Minister KTR: డబ్బా బిల్డింగులే కాదు.. అట్రాక్టివ్‌గా కూడా నిర్మాణాలు జరగాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: డబ్బా బిల్డింగులే కాదు.. అట్రాక్టివ్‌గా కూడా నిర్మాణాలు జరగాలని ఐటీ మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న భూముల ధరలు, అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుంటుందని కేటీఆర్ అన్నారు. ఏ నగరమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం మొత్తం మీద పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి సమతూకం చేస్తున్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పో-2023ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సాగునీరు, తాగునీరు, వ్యవసాయ రంగం, పరిశ్రమలు, విద్యుత్ వంటి అన్ని రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. తెలంగాణ రాకముందు ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఉండేదని, పవర్ హాలిడేలతో పరిశ్రమలకు సెలవులు ఇచ్చేవారన్నారు. జిరాక్స్ సెంటర్ నడపడానికి కూడా కరెంటు లేదన్నారు. కానీ, నేడు రాష్ట్రంలో 26 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. గతంలో హైదరాబాద్ నగరంలో నిత్యం తాగునీటి సమస్య ఉండేదని, సీఎం కేసీఆర్ దార్శనికతతో కృష్ణా, గోదావరి నదుల నుంచి వందల కిలోమీటర్ల మేర నీటిని తీసుకొచ్చి నగరవాసులకు తాగునీరు అందించడం జరిగిందన్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా 10 శాతం తాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో హైదరాబాద్‌లో తాగునీటికి కొరత ఉండదని స్పష్టం చేశారు.
Read also: Ganesh Nimajjanam: గణేశ్ నిమజ్జనంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. గతేడాది ఉత్తర్వులే అమలు..!
Also Read
- TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
- Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ప్రతి ఒక్కరు చెబుతూనే ఉన్నారని, సినీ హీరో రజనీకాంత్ లాంటి వారికి కూడా ఇది న్యూయార్క్‌నా.. హైదరాబాద్ అనే సందేహం ఉండేదని గుర్తు చేశారు. గ్లోబల్ సిటీగా పోటీ పడాలంటే మౌలిక వసతులను మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వరకు మెట్రో టెండర్లు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. నగరం చుట్టూ మెట్రో కనెక్టివిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. ఏ రంగంలోనైనా రాజధానికి మంచి శాంతి భద్రతలు ఉండాలి. గతంలో ఏ పండుగకు హైదరాబాద్ లో వారం రోజుల పాటు కర్ఫ్యూ ఉండేదని, తెలంగాణ వచ్చాక అలాంటి పరిస్థితి ఇంతవరకు రాలేదన్నారు. హైదరాబాద్ కే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం పెరిగిందని వెల్లడించారు. మెట్రో రైలు విస్తరణ, మూసీని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. మనకు గొప్ప దార్శనికత కలిగిన నాయకుడు కేసీఆర్ ఉన్నారని, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్ అంటే గచ్చిబౌలి, కొండాపూర్ అని, న్యూయార్క్ లాంటి నగరాల్లో కూడా పాత పట్టణాలు ఉన్నాయని కొందరు విమర్శిస్తున్నారు. స్కై టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చి హరిత భవనాలను ప్రోత్సహిస్తున్నదని వెల్లడించారు. డబ్బా బిల్డింగులే కాదు.. అట్రాక్టివ్‌గా కూడా నిర్మాణాలు జరగాలని సూచించారు. బిల్డర్లు హైదరాబాద్ పశ్చిమ వైపు మాత్రమే కాకుండా ఇతర వైపులను కూడా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. అక్కడ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పించిందని, సౌత్ , ఈస్ట్ హైదరాబాద్ పై బిల్డర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
Chandrababu Arrest: ‘ఇంకా చాలా మంది బయటకు వస్తారు’
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!