Suicide: ఏలూరు జిల్లా దుగ్గిరాల మండలం పినకడిమిలో విషాదం చోటుచేసుకుంది. అత్తమామల వేధింపులు తాళలేక కృష్ణానదిలో దూకి ఇద్దరు తోడికోడళ్ళు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్న కోడలు పాలపాటి స్వాతి మృత దేహం లభ్యం కాగా.. పెద్ద కోడలు రూపాదేవి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. నదిలో ఆమె కోసం ఇంకా గాలిస్తున్నారు. అత్తమామలు తన కూతురిని ఎంతగానో క్షోభ పెట్టినట్లు మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Stray Dogs Attack: వీధి కుక్కల దాడిలో 7 నెలల బాలుడి మృతి..
విషయం తెలియడంతో అత్తమామల ఇంటిని మృతురాలి బంధువులు ధ్వంసం చేశారు. ఆ ఇంటి ముందే వారు ఆందోళన చేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలి ఫిర్యాదు మేరకు అత్తమామలు, భర్తలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.