భక్తి టీవీ కోటి దీపోత్సవం నాల్గోరోజు కన్నులపండుగగా సాగింది.. అక్టోబర్ 31వ తేదీన ప్రారంభమైన ఈ మహాక్రతువు ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుండగా.. ఇవాళ నాల్గోరోజు దీపాల ఉత్సవం కోలాకలంగా సాగింది… శ్రీసుబుదేంద్ర తీర్థ స్వామీజీ (శ్రీరాఘవేంద్ర మఠం, మంత్రాలయం) వారిచే అనుగ్రహ భాషణం.. బ్రహ్మ శ్రీ డా.కాకునూరి సూర్యనారాయణమూర్తిచే ప్రవచానమృతం.. వేదికపై పూజలో భాగంగా నర్మదా బాణ లింగానికి కోటి భస్మాభిషేకం నిర్వహించారు.. శివలింగాలకు కోటి భస్మార్చన భక్తులచే జరిపించారు.. ఇక, యాదాద్రి…
భక్తి టీవీ-ఎన్టీవీ ఆధ్వర్యంలో జరుగుతోన్న కోటిదీపోత్సవం నాల్గో రోజుకు చేరింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం భక్తులతో కిక్కిరిసిపోయింది… శివనామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి.. కార్తిక మాసంలో జరుగుతోన్న దీపాల ఉత్సవంలో ఉత్సాహంగా పెద్ద సంఖ్యలు పాల్గొంటున్నారు భక్తులు.. ఇవాళ పార్థివలింగానికి కోటి భస్మార్చన జరగనుంది… ఇక, వేములవాడ రాజరాజేశ్వర స్వామి కల్యాణం.. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం నిర్వహించనున్నారు.. భక్తులకు పూజా సామాగ్రిని కూడా ఉచితంగా అందజేస్తోంది భక్తి టీవీ… ఎన్టీఆర్ స్టేడియానికి కదలి రండి..…
కార్తిక మాసం వచ్చిందంటే చాలు.. అందరూ ఎన్టీవీ-భక్తిటీవీ ఆధ్వర్యంలో నిర్వహించి కోటిదీపోత్సవం గురించి చూస్తుంటారు.. గత మూడు రోజులుగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కన్నుల పండువగా కోటి దీపాల ఉత్సవం సాగుతోంది.. ఈ కోటి దీపోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు… శివనామస్మరణతో ఎన్టీఆర్ స్టేడియం, పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి.. ఇవాళ కార్తీక బుధవారం సందర్భంగా ‘ప్రదోషకాల అభిషేకం’ నిర్వహించారు.. డాక్టర్ ఎన్. అనంతలక్ష్మీ గారి ప్రవచనామృతం భక్తులను ఆకట్టుకుంది.. కాజీపేట శ్వేతార్కమూల గణపతికి కోటి గరికార్చన జరగగా..…
Bhakthi Tv Koti Deepotsavam 2022: భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు. తొలి రెండు రోజులు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం సాగింది. రెండో రోజు అలంపురం శ్రీజోగులాంబ కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. మూడో రోజు కూడా కోటి దీపోత్సవంలో విశేష కార్యక్రమాలు ఉంటాయి. ఈనెల 14వ తేదీ వరకు భక్తి టీవీ కోటిదీపోత్సవం కొనసాగనుంది. నవంబర్ 02, కోటి దీపోత్సవం 3వ రోజు విశేష కార్యక్రమాలు: * కార్తీక బుధవారం…
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఎన్టీవీ-భక్తి టీవీ ఘనంగా కోటిదీపోత్సవాన్ని నిర్వహిస్తోంది.. తొలి రోజు అన్ని కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.. శివనామస్మరణతో ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు మారుమోగి పోయాయి.. వేలాది మంది భక్తులు వచ్చి కోటిదీపోత్సవంలో పాలుపంచుకున్నారు.. ఇక, రెండో రోజు కోటిదీపోత్సవం ప్రారంభమైంది… కన్నులపండుగగా.. ఇల కైలాసంలో జరుగుతోన్న ఆ దీపాల ఉత్సవాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=5bjCLsDY210
కార్తిక మాసం వచ్చిందంటే చాలు అందరి దృష్టి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంవైపే వెళ్తుంది.. ఎందుకంటే ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవమే కారణం.. వేలసంఖ్యలో భక్తులు వచ్చి కోటిదీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగిస్తారు.. ఇక, కుదరని వాళ్లు ఎన్టీవీ, భక్తి టీవీల్లో లైవ్‌లో వీక్షిస్తుంటారు.. ఈ ఏడాది కోటి దీపోత్సవం ఈ రోజే ప్రారంభమైంది… కోటిదీపోత్సవం-2022 మొదటి రోజు శంఖారావంతో ప్రారంభమైంది.. ఉత్సవంలో భాగంగా ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు.. ఇక, బ్రహ్మశ్రీ డా||…