Koti Deepotsavam LIVE: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కోటి దీపోత్సవం వైభవంగా సాగుతోంది… రెండో రోజు కోటి దీపాల కాంతులతో ఎన్టీఆర్ స్టేడియం, పరిసర ప్రాంతాలు వెలిగిపోయాయి… శివనామస్మరణతో ఆ ప్రాంతాలు మార్మోగాయి.. వేలాది మంది ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. లక్షలాది మంది టీవీలో వీక్షిస్తున్నారు.. ఇక, కోటిదీపోత్సవం-2022 3వ రోజు శంఖారావంతో ప్రారంభమైంది… ఈ రోజు కాజీపేట గణపతికి కోటి గరికార్చన జరగనుండగా.. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణం.. మోపిదేవి సుబ్రహ్మణ్య కల్యాణం నిర్వహించనున్నారు.. ఎన్టీఆర్ స్టేడియంలో కన్నులపండుగగా సాగుతోన్న కోటి దీపోత్సవాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..