Bhakthi Tv Koti Deepotsavam 2022: భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు. తొలి రెండు రోజులు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం సాగింది. రెండో రోజు అలంపురం శ్రీజోగులాంబ కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. మూడో రోజు కూడా కోటి దీపోత్సవంలో విశేష కార్యక్రమాలు ఉంటాయి. ఈనెల 14వ తేదీ వరకు భక్తి టీవీ కోటిదీపోత్సవం కొనసాగనుంది.
నవంబర్ 02, కోటి దీపోత్సవం 3వ రోజు విశేష కార్యక్రమాలు:
* కార్తీక బుధవారం సందర్భంగా ‘ప్రదోషకాల అభిషేకం’
* డా.ఎన్. అనంతలక్ష్మీ గారి ప్రవచనామృతం
* కాజీపేట శ్వేతార్కమూల గణపతికి కోటి గరికార్చన
* ఇష్టకామ్యాలను ప్రసాదించే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణం
* మూషిక వాహన సేవ
* మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం
* శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, తపోవనం, తుని
* శ్రీ స్వరూపానందగిరి స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, శ్రీ లలితాపీఠం, తిరుపతి
* ఇలకైలాసంలో భక్తులచే సామూహిక కార్తీక దీపారాధన
* కనీవినీ ఎరుగని రీతిలో కార్తీకమాసం శుభవేళ బంగారు లింగోద్భవ దృశ్యం
* ఇంటిల్లిపాదికి సమస్త శుభాలు కలుగజేసే సప్త హారతి
* శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారికి గురు వందనం
* శ్రీ స్వరూపానందగిరి స్వామీజీ వారికి గురు వందనం
* పుణే డప్పు వాయిద్యం, పంబమేళా, సాంస్కృతిక కదంబం
* మహా మంగళ హారతి
కోటి దీపోత్సవం కోసం ప్రతి రోజూ ఎన్టీఆర్ స్టేడియం అందంగా ముస్తాబవుతోంది. కోటి దీపోత్సవానికి అవసరమైన అన్ని పూజా సామాగ్రి, పూలు భక్తి టీవీ భక్తులకు ఉచితంగా అందిస్తోంది. ప్రతిరోజూ కోటి దీపోత్సవానికి రావాలని భక్తులు కోరుకుంటారు. రాలేని వారు ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తరిస్తున్నారు. కోటి దీపోత్సవానికి వచ్చే భక్తులకు ఎన్టీవీ, భక్తిటీవీ, వనిత టీవీ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఆ పరమ శివుని అనుగ్రహం మీ అందరికీ ఉండాలని రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ కుటుంబం మనసారా కోరుకుంటోంది.