భక్తి టీవీ కోటి దీపోత్సవం నాల్గోరోజు కన్నులపండుగగా సాగింది.. అక్టోబర్ 31వ తేదీన ప్రారంభమైన ఈ మహాక్రతువు ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుండగా.. ఇవాళ నాల్గోరోజు దీపాల ఉత్సవం కోలాకలంగా సాగింది… శ్రీసుబుదేంద్ర తీర్థ స్వామీజీ (శ్రీరాఘవేంద్ర మఠం, మంత్రాలయం) వారిచే అనుగ్రహ భాషణం.. బ్రహ్మ శ్రీ డా.కాకునూరి సూర్యనారాయణమూర్తిచే ప్రవచానమృతం.. వేదికపై పూజలో భాగంగా నర్మదా బాణ లింగానికి కోటి భస్మాభిషేకం నిర్వహించారు.. శివలింగాలకు కోటి భస్మార్చన భక్తులచే జరిపించారు.. ఇక, యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహ స్వామి పరిణయోత్సవం, వేముల వాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి కల్యాణం వైభవంగా సాగింది.. ఇవాళ వాహనసేవలో భాగంగా అశ్వవాహనం, పల్లకి సేవ నిర్వహించారు..
కాగా, ప్రతీ ఏటా కార్తిక మాసంలో ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నారు.. కోటి దీపోత్సవానికి అవసరమైన అన్ని పూజా సామాగ్రి, పూలు భక్తులకు ఉచితంగా అందిస్తోంది. కార్తిక మాసం శుభవేళ బంగారు లింగోద్భవ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాలు ఓం నమఃశివాయా నామ స్మరణతో మార్మోగిపోతున్నాయి.. విశేషమైన భక్తుల మధ్య.. అన్ని కార్యక్రమాలు ఆద్యంతం కోటిదీపోత్సవం నాల్గో రోజు కన్నుల పండుగగా సాగింది.