భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కన్నుల పండువగా జరుగుతున్న కోటి దీపోత్సవం కార్యక్రమం 10వరోజుకు చేరింది. 10వ రోజు జరిగిన కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా వైభవంగా నిర్వహించడం అంత సులువేమీ కాదని.. కానీ అసాధ్యాన్ని నరేంద్ర చౌదరి సుసాధ్యం చేశారని కిషన్‌రెడ్డి కొనియాడారు. అంతేకాకుండా…
కార్తికమాసాన ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తిటీవీ నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. నవంబర్ 12వ తేదీన ప్రారంభమైన ఈ వేడుకలు 22న ముగియనున్నాయి. నేడు 10వ రోజును పురస్కరించుకొని విశేషాలను చూద్దాం.. విశాఖపట్నం శారదా పీఠం శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి వార్లచే అనుగ్రహ భాషణం. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మచే ప్రవచనామృతం. అనంతరం ఏడుకొండల్లో కొలువుదీరిన కోనేటి రాయుడు తిరుమల శ్రీనివాస కల్యాణోత్సవం నేత్రపర్వంగా జరుగనుంది. ఆ తరువాత భక్తులను…
భక్తిటీవీ సగర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం వేడుకలు అంబరాన్నంటాయి. ఈ నెల 12 నుంచి 22 వరకు జరుగుతున్న కోటి దీపోత్సవం వేడుకలు నేడు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కార్యక్రమాలను ఓ సారి చూద్దామా.. సుందరంగా అలకంరించిన వేదికపైన మైసూరు అవధూతపీఠం పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిచే అనుగ్రహ భాషణం. బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావుచే ప్రవచనామృతం. అనంతరం కొల్పపూర్ శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన వేదికపైనే కాకుండా భక్తులతో కూడా ఈ…
జయ జయ శంకర… శివ శివ శంకర… శంభో శంకర.. హర హర మహాదేవ.. శివ శివ శంకర.. హరహర శంకర అంటూ హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం మారుమోగిపోయింది. భక్తుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఈనెల 12వ తేదీన ప్రారంభమయిన భక్తి టీవీ కోటిదీపోత్సవం అప్రతిహతంగా సాగిపోతోంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా భక్తిటీవీ కోటి దీపోత్సవం నిర్వహించారు. వేలాదిగా హాజరైన భక్తులు జ్వాలాతోరణం వీక్షిస్తూ పరవశించారు. నిండుపున్నమి వెలుగులో శ్రీశైల మల్లన్న…
భక్తిటీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం వేడుక ఈ సంవత్సరం కూడా భక్తకోటిని ఆధ్యాత్మిక చింతనలో ముంచెత్తుతోంది. నవంబర్ 12వ తేదిన అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ కోటి దీపోత్సవ వేడుక నేడు 8వ రోజుకు చేరుకుంది. ఈ రోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని విశేషాలను చూద్దాం.. బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుచే ప్రవచనామృతం. అనంతరం మొట్టమొదటిసారిగా ఉజ్జయిని అర్చకులచే మహాకాళేశ్వర భస్మహారతి, బిల్వార్చన కార్యక్రమం వేదికపైనే కాకుండా భక్తులచే కూడా నిర్వహించనున్నారు. ఆ…
ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగా ఈ సంవత్సరం కూడా భక్తిటీవీ సగర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా అలరారుతోంది. కోటి దీపోత్సవం కార్యక్రమం ఈ నెల 12 నుంచి 22 వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు 7వ రోజును పురస్కరించుకొని విశేష కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఈ రోజు వైకుంఠ చతుర్ధశిని పురస్కరించుకొని శ్రీ వేంకటేశ్వర స్వామి ముడుపుల పూజ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించనున్నారు. అంతేకాకుండా తన ప్రవచనాలతో ఇటు యువతను, అటు పెద్దలను…
ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగానే భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నవంబర్ 12 నుంచి 22వరకు వైభవోపేతంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ సంయుక్తంగా శ్రీకారం చుట్టాయి. అయితే నేడు 6వ రోజు సందర్భంగా విశేషాలను తెలుసుకుందాం.. కాజీపేట గణపతి కోటి గరికార్చన, గణపతి విగ్రహాలకు గరికార్చనతో పాటు కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక కళ్యాణం అనంతరం మూషిక వాహనంపై ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.…