రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం ఐదవ రోజుకి చేరుకుంది.. కార్తిక శుద్ధ ఏకాదశి కావడంతో ఇవాళ భక్తులు భారీగా తరలిరానున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి భక్తులు వివిధ ప్రాంతాలనుంచి తరలివస్తున్నారు. అందరి దేవుళ్లను, అన్ని ఆలయాలను ఒకేచోట చూసే భాగ్యం భక్తులకు కలుగుతోంది.
అనుగ్రహ భాషణంలో భాగంగా శ్రీ స్మరణానంద గిరి స్వామీజీ (వైస్ ప్రెసిడెంట్ యోగదా సత్సంగ సొసైటీ, రాంచీ)
శ్రీ సర్వవిదానంద సరస్వతి స్వామీజీ (ఆర్ష విద్యా గురుకులం, హైదరాబాద్)
వెనరెబుల్ బిక్కు సంఘ పాల (మహాబోధి బుద్ధ విహార, హైదరాబాద్) వుంటుంది
బ్రహ్మ శ్రీ డా.మైలవరపు శ్రీనివాసరావు గారిచే ప్రవచనామృతం ఉంటుంది
విజయవాడ శ్రీ కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన వేదిక పూజ కార్యక్రమంలో వుంటుంది
అంతేకాకుండా శ్రీ కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన భక్తులు స్వయంగా చేసే అద్భుత అవకాశం కలుగుతుంది
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు
ఈరోజు సింహ వాహనం సేవ ఉంటుంది. వీటితో పాటు సకల శుభాలను కలిగించే సప్త హారతి ఉంటుంది.
కోటి దీపోత్సవం గురువారం 4వ రోజు అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు వేలాదిమంది తరలిరావడంతో ఎన్టీఆర్ స్టేడియం భక్త జనసంద్రంగా మారింది. అక్టోబర్ 31వ తేదీన ప్రారంభమైన ఈ మహాక్రతువు ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుండగా.. ఇవాళ నాల్గోరోజు దీపాల ఉత్సవం కోలాహలంగా సాగింది… శ్రీసుబుదేంద్ర తీర్థ స్వామీజీ (శ్రీరాఘవేంద్ర మఠం, మంత్రాలయం) వారిచే అనుగ్రహ భాషణం.. బ్రహ్మ శ్రీ డా.కాకునూరి సూర్యనారాయణమూర్తిచే ప్రవచానమృతం.. వేదికపై పూజలో భాగంగా నర్మదా బాణ లింగానికి కోటి భస్మాభిషేకం నిర్వహించారు.. శివలింగాలకు కోటి భస్మార్చన భక్తులచే జరిపించారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహ స్వామి పరిణయోత్సవం, వేముల వాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి కల్యాణం వైభవంగా సాగింది.. ఇవాళ వాహనసేవలో భాగంగా అశ్వవాహనం, పల్లకి సేవ నిర్వహించారు. భక్తుల కోలాహలం మధ్య నాల్గవ రోజు కోటి దీపోత్సవం నేత్రానందం కలిగించింది. రండి.. తరలిరండి.. భక్తి టీవీ కోటిదీపోత్సవం ప్రాంగణానికి తరలివచ్చి ఆ పరమశివుని కృపకు పాత్రులు కండి.. ఎన్టీవీ, భక్తిటీవీ, వనిత టీవీ కుటుంబం భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది.