భక్తి టీవీ-ఎన్టీవీ ఆధ్వర్యంలో జరుగుతోన్న కోటిదీపోత్సవం నాల్గో రోజుకు చేరింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం భక్తులతో కిక్కిరిసిపోయింది… శివనామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి.. కార్తిక మాసంలో జరుగుతోన్న దీపాల ఉత్సవంలో ఉత్సాహంగా పెద్ద సంఖ్యలు పాల్గొంటున్నారు భక్తులు.. ఇవాళ పార్థివలింగానికి కోటి భస్మార్చన జరగనుంది… ఇక, వేములవాడ రాజరాజేశ్వర స్వామి కల్యాణం.. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం నిర్వహించనున్నారు.. భక్తులకు పూజా సామాగ్రిని కూడా ఉచితంగా అందజేస్తోంది భక్తి టీవీ… ఎన్టీఆర్ స్టేడియానికి కదలి రండి.. కోటి దీపాల పండుగలో భాగస్వాములు కండి.. శివకేశవుల అనుగ్రహాన్ని పొందండి అంటూ ఆహ్వానం పలుకుతోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. ఇక, ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా సాగుతోన్న కోటి దీపోత్సవాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..