శివకేశవులు ఇద్దరు కాదు.. ఒక్కటే అనే దానికి నిదర్శనం ఈ రోజు కోటి దీపోత్సవంలో జరిగి కళ్యాణమహోత్సవమే. క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం శ్రీతులసీదామోదర కళ్యాణంతో పాటు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ-గంగ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం కన్నులపండువగా సాగింది. కోటి దీపోత్సవ వేదికపైన ఉన్న సాంబయ్యను పెళ్లిచేసుకునేందుకు కదిలి వచ్చిన బెజవాడ దుర్గమ్మ కు జేజేలు అంటూ భక్తులను ఉద్దేశించి అర్చకులు వేదమంత్రోత్చరణల నడుమ స్వామి వార్ల కళ్యాణం జరిపించారు. ముందుకు వైంకుఠాధీశుడు శ్రీతులసీదామోదర కళ్యాణం…
ఏటూ చూసిన శివనామస్మరణ.. అడుగడుగునా పంచాక్షరి పలుకులు.. అహా ఇది కైలాసమా అనట్టు ఉండే వేదిక.. ఆ వేదికను అలంకరించిన దైవ స్వరూపులైన పెద్దలు.. ఏమి చెప్పమంటారు కోటి దీపోత్సవ కళాశోభ.. ఇక బంగారు లింగోద్భవ ఘట్టం గురించి చెప్పాలంటే.. మాటలు రావడం లేదు.. కోటి దీపోత్సవ ప్రాంగణంలో అడుగుపెట్టిన మొదలు బయటికి వచ్చే వరకు కార్తీకమాసంలో కైలాసం దర్శనం జరుగుతోందనే భావన తప్ప మరేది మదిలోకి రాదు అనడం అతిశయోక్తి లేదు. మంగళవాయిద్యాలు నడుమ స్వామి…
భక్తిటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం నాలుగోరోజుకు చేరింది. కార్తీక మాసాన జరుగుతున్న ఈ కార్యక్రమం కన్నుల పండువగా జరుగుతోంది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మికంగా పరవశింపబడ్డారు. ఈరోజు కోటిదీపోత్సవం కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. సోమవారం సాయంత్రం తొలుత శ్రీ ప్రకాశనందేంద్ర సరస్వతి స్వామి, శ్రీ అవధూతగిరి మహారాజ్, మహంత్ శ్రీసిద్ధేశ్వరానందగిరి మహారాజ్, బర్దీపూర్, శ్రీలలితా పీఠం శ్రీ స్వరూపానందగిరి…
కార్తీక మాసాన భక్తి టీవీ కోటిదీపోత్సవం ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతోంది. మూడో రోజైన నేడు సింహాచలేశునికి హరిచందన పూజ, సింహాద్రి అప్పన్న కల్యాణ వైభోగం, చందనాల స్వామికి పల్లకీ ఉత్సవం, అహోబిలం శ్రీరామానుజ జీయర్ స్వామి ఆశీర్వచనం, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనామృతం లాంటి విశేషాలతో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతోంది. కాగా.. ఈ నెల 12 తేదీన సాయంత్రం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల నుంచి కోటి దీపోత్సవం…
కార్తీకం వచ్చిందంటే భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంలో ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతాయి. కోటికాంతులు భక్తుల మనసులను పులకింపజేస్తాయి. ఓంకారానికి తోడు శంఖారావాలు, ఢమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేదపారాయణాలు, జగద్గురువుల అనుగ్రహ భాషణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు దీపోత్సవానికి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ఈ ఏడాది కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తిటీవీ కోటిదీపోత్సవం నిర్వహిస్తోంది.. ఇవాళ్టి నుంచీ ఈ నెల 22వ తేదీ వరకు కన్నుల పండువగా ఈ కార్యక్రమం జరుగుతోంది.. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతీరోజు…