సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార తన ప్రియుడు, డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సోమవారం ఉదయం ఈ లవ్ బర్డ్స్ ఇద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్న నయనతార పూజ అనంతరం ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వాదం పొందారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్న ఈ జంటను టీటీడీ ఆలయ అధికారులు సత్కరించారు.
Read Also : అడవి శేష్ బ్యాక్ టు హోమ్… ఆరోగ్య పరిస్థితి ఏంటంటే ?
అనంతరం ఇరువురూ కలిసి మీడియాకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక గతకొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నయన్ తనకు ఎంగేజ్మెంట్ జరిగినట్టు వెల్లడించింది. దీంతో నయన్, విగ్నేష్ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారు అనే వార్తలు షికార్లు చేస్తున్నాయి.