కోలీవుడ్ స్టార్ హీరో నటించిన తాజా చిత్రం “జై భీమ్”. జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ముఖ్యమంత్రి నుంచి సామాన్యుల వరకు అందరిని ఫిదా చేసేస్తోంది. నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సమాజంలో అణగారిన వర్గాలపై చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కొందరు పెద్ద మనుషులు చేస్తున్న దారుణమైన పనుల గురించి చూపించారు. మంచి సామాజిక కథాంశంతో రూపొందిన ఈ సినిమా అందరి మనసులను తాకుతోంది. అన్యాయంగా ఓ కేసులో చిక్కుకున్న పేద కుటుంబం తరపున పోరాడే లాయర్ గా సూర్య నటన, కథ ఆలోచింపజేసే విధంగా ఉంది. ఈ సినిమాను సూర్య, జ్యోతిక కలిసి తమ సొంత నిర్మాణ సంస్థలో నిర్మించారు.
Read also : “భీమ్లా నాయక్” అప్డేట్… దీపావళి ట్రీట్ గా ప్రోమో
ఈ సినిమాపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రత్యేకంగా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. “జై భీమ్” ప్రత్యేక ప్రీమియర్ షోను వీక్షించిన సీఎం స్టాలిన్ సినిమాపై తన అభిప్రాయాన్ని మనస్ఫూర్తిగా సుదీర్ఘ వివరణతో పోస్ట్ చేశారు. “జై భీమ్ మూవీ చూశాక నా హృదయం బరువెక్కింది. నోట మాట రాలేదు. రాత్రంతా నిద్రపట్టలేదు. ఆ సినిమానే మదిలో మెదిలింది” అంటూ సోషల్ మీడియాలో సుదీర్ఘ లేఖను పోస్ట్ చేశారు. ఇంకా ఆయన సూర్యతో పాటు చిత్రబృందాన్ని కూడా ప్రశంసలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సినిమాను వీక్షించిన సెలెబ్రిటీలు, ప్రేక్షకులు సైతం సోషల్ మీడియా వేదికగా ‘జై భీమ్’పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
பார்வையளர்களின் மனதில் தாக்கத்தையும் அதன்விளைவாக சமூகத்தில் நல்லதொரு மாற்றத்தையும் ஏற்படுத்துவதுதான் சிறந்ததொரு கலைப்படைப்பு!
— M.K.Stalin (@mkstalin) November 1, 2021
நேற்று நண்பர் @Suriya_offl வழக்கறிஞர் சந்துருவாக வாழ்ந்துள்ள #ஜெய்பீம் திரைப்படத்தைப் பார்த்தேன். அத்திரைப்படம் ஏற்படுத்திய அதிர்வுகள் ஏராளம். pic.twitter.com/khinGGgRLF