సూపర్ స్టార్ రజినీ కాంత్ మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. గత కొన్నిరోజుల క్రితం ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చేరిన తలైవా పూర్తిగా కోలుకొని ఇంటికి తిరిగివచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత షూటింగ్ లో కూడా పాల్గొనడం, ఇటీవలే ఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అత్యున్నత ఫిల్మ్ పురస్కారం దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందుకోవడంతో తలైవా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సమయంలో రజినీ హాస్పిటల్…
ఏ సినిమా చూసిన నీతి సారం మాత్రం చెడుపై మంచి గెలవడమే.. ప్రతి సినిమా ముగింపు సమాజ హితం కోసమేనని ఇప్పటికే చాలా సినిమాలు చూపించాయి. అందుకే సినిమా స్టార్స్ కి అంతటి క్రేజ్ ఉంటుంది. వాళ్లే బయట చెప్పే మాటలకు కూడా అంత ప్రభావం ఉంటుంది. అయితే తాజాగా ఓ సినిమా సీన్ తో తొమ్మిదేళ్ల చిన్నారి తన నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టిన తీరు నటి జ్యోతిక మనసును గెలిచింది. నటి జ్యోతిక తొలిసారి లాయర్ పాత్రలో…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తాజా చిత్రం ‘వాలిమై’ వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇటీవలే దీని ప్రమోషన్ యాక్టివిటీస్ ను మొదలు పెట్టారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తెలుగు స్టార్ హీరో కార్తికేయ విలన్ గా నటిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే… సినిమాల్లోకి రాకముందు నుండే అజిత్ కు బైక్స్ అంటే ప్రాణం. అంతేకాదు అతను ప్రొఫెషనల్ రేసర్ కూడా! కొంతకాలంగా అజిత్ బైక్ పై వరల్డ్ టూర్…
హ్యూమన్ రిలేషన్స్, లవ్ స్టోరీ సినిమాలతో ఆకట్టుకుంటూ వస్తున్న శేఖర్ కమ్ముల ఈ సారి థ్రిల్లర్ పై కన్నేశాడు. నాగచైతన్య, సాయిపల్లవితో కమ్ముల తీసిన ‘లవ్ స్టోరీ’ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో సమావేశమైన శేఖర్ తన తదుపరి చిత్రాన్ని ధనుష్‌తో తీయబోతున్నట్లు ధృవీకరించాడు. నిజానికి ఇప్పటికే దీని గురించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అయితే శేఖర్ కమ్ముల ఈ సారి తను తీయబోయే సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా తెలియచేశాడు.…
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు టాలీవుడ్ లోను మంచి మార్కెట్ వున్నా విషయం తెలిసిందే.. ఆయన ప్రతి సినిమాను తెలుగులోనూ డబ్ అయ్యేలా చూసుకుంటాడు. ‘పందెం కోడి, పొగరు, భరణి, వాడు వీడు, అభిమన్యుడు, డిటెక్టివ్ వంటి సినిమాలతో తెలుగు అభిమానులను అలరించాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాల్లో నటిస్తుండగా.. తాజాగా విశాల్ తన 32వ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఆగస్ట్ 29న విశాల్ పుట్టినరోజు సందర్భంగా చెన్నైలోని ప్రముఖ సాయిబాబా ఆలయంలో ఈ…
తమిళనాట దర్శకుడు బాలాకి మంచి క్రేజ్ ఉంది. వివాదాస్పద అంశాలతో హార్డ్ హిట్టింగ్ సినిమాలను చేస్తుంటాడు బాల. అందుకే స్టార్స్ కూడా తన సినిమాలో నటించటానికి ఆసక్తి చూపిస్తుంటారు. బాల చివరగా జ్యోతిక నటించిన 2018 థ్రిల్లర్ డ్రామా ‘నాచియార్’ ను తెరకెక్కించాడు. ఆ తర్వాత విక్రమ్ కుమారుడు తో చేసిన ‘వర్మ’ సినిమా నచ్చలేదని వేరే దర్శకుడుతో రీ-షూట్ చేసి విడుదల చేశారు. ప్రస్తుతం బాల మలయాళ ‘జోసెఫ్’ ఆధారంగా ‘విశిథిరన్’ అనే సినిమాను పద్మకుమార్…
తమిళనాట కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు అగ్ర దర్శకులు. తెలుగులో యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ అందరూ కలసి గిల్డ్ పేరుతో సినిమాలు తీస్తున్నట్లు తమిళనాట అగ్రదర్శకులందరూ కలసి ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. తెలుగులో నిర్మాతలు ఎవరికివారు హీరోలతో టై అప్ పెట్టుకుని సినిమాలు తీస్తుంటే తమిళంలో మాత్రం దర్శకులందరూ కలసి ఒకే గొడుగు కింద సినిమాలు తీయబోతున్నారు. మణిరత్నం, శంకర్, గౌతమ్ మీనన్, వెట్రిమారన్, మిస్కిన్, లింగుస్వామి, మురుగదాస్, బాలాజీ శక్తివేల్, శశి, లోకేశ్ కనకరాజ్…
ప్రముఖ కథానాయకుడు విశాల్ కు మద్రాస్ హైకోర్టు నుండి ఊరట లభించింది. విశాల్ నిర్మించిన ‘చక్ర’ సినిమాకు సంబంధించిన వివాదం ఒకటి కొంతకాలంగా కోర్టులో నానుతోంది. ఈ సినిమా దర్శకుడు తొలుత కథను తమకు చెప్పాడని, అది నచ్చి తాము సినిమా నిర్మించడానికి సిద్ధపడిన తర్వాత దాన్ని విశాల్ సొంతంగా తీశాడంటూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టుకు ఎక్కింది. అయితే… కోర్టు దీనిని కొట్టేసింది. అంతేకాదు… విశాల్ పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు రూ. 5 లక్షల…
దళితులను తమిళ ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని నటి, బిగ్‌బాస్ బ్యూటీ మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దళితులను కించపరిచేలా మాట్లాడిన ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా మరో ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెకు పోలీసులు నోటీసులు పంపారు. కాగా, ఆమె హాజరు కాకపోయేసరికి అరెస్ట్ అవుతుందంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. నన్ను అరెస్ట్ చేయడం మీ కల..…
కోవిడ్ ఇబ్బందులు ఇంకా పూర్తిగా పోలేదు. థియేటర్లు తెరుచుకున్నా, షూటింగ్ లు కొనసాగుతున్నా కరోనా కలవరం అందర్నీ వేధిస్తూనే ఉంది. ఇప్పుడు అదే సమస్య సూర్య, కమల్ హాసన్ మధ్య కూడా వచ్చింది. మహమ్మారి ఎఫెక్ట్ తో కమల్ హాసన్ కొద్ది రోజులు తన చిత్రాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. అయితే, అందుక్కారణం హీరో సూర్య కావటమే కోలీవుడ్ లో చర్చగా మారింది. సూర్య ‘ఎతరుక్కుమ్ తునిందవా’ సినిమా చేస్తున్నాడు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా…