కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు వచ్చిన వార్త కలకలం రేపుతోంది. విజయ్ ఇంట్లో బాంబ్ పెట్టినట్లు చెన్నై పోలీసులకు కాల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చెన్నైలోని విజయ్ ఇంటిని తనిఖీ చేశారు. అక్కడ ఎటువంటి బాంబు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో ఆకతాయి ఇలాంటి ఫేక్ ఫోన్ కాల్ చేసినట్లు అనుమానించిన పోలీసులు ఎట్టకేలకు ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడిని విళ్లుపురం జిల్లా మరక్కాణం గ్రామానికి…
అభిమానులకు సినీ తారలు అంటే ఎంత ఇష్టమో.. వారికి కూడా అభిమానులంటే అంతే ప్రాణం. వారు చేసే ఎలాంటి సినిమాలైనా అభిమానుల కోసమేనని వారు ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్యాన్స్ కష్టాల్లో ఉంటె ఆదుకొంటారు.. వారు అకాల చెందితే వీరు బాధపడతారు. తాజాగా చెన్నై బ్యూటీ త్రిష కూడా అదే విషాదంలో ఉంది. త్రిష వీరాభిమాని అయిన కిషోర్ మృతిచెందాడు. దీంతో త్రిష గుండె ముక్కలయింది. బరువెక్కిన హృదయంతో ట్విట్టర్ ద్వారా తన వీరాభిమాని మృతికి సంతాపం…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్న ‘జై భీమ్’ సినిమా గురించే చర్చ నడుస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. హీరో సూర్య యాక్టింగ్, ఆ కథ వెరసి ఆ సినిమాను ఊహించలేనంత విజయాన్ని అందుకునేలా చేశాయి. అయితే దీనిపై ఒక పక్క వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ఎక్కడా సూర్య జంకడం లేదు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఒక కథను సూర్య ఎంచుకోవడం.. దానిని ఆయనే స్వయంగా నిర్మించడం పెద్ద రిస్క్ తో కూడుకున్న పని.…
ఇటీవల కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిపై ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. తాగిన మైకంలో ఒక వ్యక్తి విజయ్ సేతుపతి పీఏపై దాడి చేశాడు. అనంతరం అతడే క్షమించమని అడగడంతో ఈ గొడవ ముగిసింది. ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేయవద్దని సేతుపతి చెప్పడం చర్చనీయాంశంగా మారిన సంగతి కూడా విదితమే. ఇక తాజగా ఈ ఘటనపై విజయ్ సేతుపతి స్పందించారు. “అది ఒక చిన్న ఘటన.. ఎయిర్ పోర్ట్ లో…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఉదయం జిమ్ చేస్తుండగా సడెన్ హార్ట్ స్ట్రోక్ రావడంతో పునీత్ మృతిచెందారు. పునీత్ మరణాన్ని కన్నడ ఇండస్ట్రీ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇప్పటికే స్టార్ హీరోలందరు పునీత్ ఇంటికి వెళ్లి ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఇటీవలే రామ్ చరణ్, హీరో శివ కార్తికేయన్ పునీత్ సమాధివద్ద నివాళులర్పించగా.. తాజాగా హీరో సూర్య పునీత్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. పునీత్ సమాధి…
సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాతే దీపావళి కానుకగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో పెద్దన్న గా విడుదల కానుంది. ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్, ఖూష్బూ, మీనా హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు కావడంతో తలైవా ఫ్యాన్స్ కి పండగ వాతావరణం మొదలైయిపోయింది. రజినీ మూవీ అంటే ఫస్ట్ డే.. ఫస్ట్ డే పడాల్సిందే.. ఆరోజు స్కూల్ ఉందా.. ఆఫీస్ ఉందా..? ఇంట్లో…
సూపర్ స్టార్ రజినీ కాంత్ మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. గత కొన్నిరోజుల క్రితం ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చేరిన తలైవా పూర్తిగా కోలుకొని ఇంటికి తిరిగివచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత షూటింగ్ లో కూడా పాల్గొనడం, ఇటీవలే ఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అత్యున్నత ఫిల్మ్ పురస్కారం దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందుకోవడంతో తలైవా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సమయంలో రజినీ హాస్పిటల్…
ఏ సినిమా చూసిన నీతి సారం మాత్రం చెడుపై మంచి గెలవడమే.. ప్రతి సినిమా ముగింపు సమాజ హితం కోసమేనని ఇప్పటికే చాలా సినిమాలు చూపించాయి. అందుకే సినిమా స్టార్స్ కి అంతటి క్రేజ్ ఉంటుంది. వాళ్లే బయట చెప్పే మాటలకు కూడా అంత ప్రభావం ఉంటుంది. అయితే తాజాగా ఓ సినిమా సీన్ తో తొమ్మిదేళ్ల చిన్నారి తన నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టిన తీరు నటి జ్యోతిక మనసును గెలిచింది. నటి జ్యోతిక తొలిసారి లాయర్ పాత్రలో…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తాజా చిత్రం ‘వాలిమై’ వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇటీవలే దీని ప్రమోషన్ యాక్టివిటీస్ ను మొదలు పెట్టారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తెలుగు స్టార్ హీరో కార్తికేయ విలన్ గా నటిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే… సినిమాల్లోకి రాకముందు నుండే అజిత్ కు బైక్స్ అంటే ప్రాణం. అంతేకాదు అతను ప్రొఫెషనల్ రేసర్ కూడా! కొంతకాలంగా అజిత్ బైక్ పై వరల్డ్ టూర్…
హ్యూమన్ రిలేషన్స్, లవ్ స్టోరీ సినిమాలతో ఆకట్టుకుంటూ వస్తున్న శేఖర్ కమ్ముల ఈ సారి థ్రిల్లర్ పై కన్నేశాడు. నాగచైతన్య, సాయిపల్లవితో కమ్ముల తీసిన ‘లవ్ స్టోరీ’ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో సమావేశమైన శేఖర్ తన తదుపరి చిత్రాన్ని ధనుష్‌తో తీయబోతున్నట్లు ధృవీకరించాడు. నిజానికి ఇప్పటికే దీని గురించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అయితే శేఖర్ కమ్ముల ఈ సారి తను తీయబోయే సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా తెలియచేశాడు.…