‘’ఎప్పుడో 30 ఏళ్ల కిందట మేం చేసిన చిత్రాలు చూసి ఆశ్చర్యపోవటం కాదు… ఇప్పుడు ఇక ఈ తరం ఫిల్మ్ మేకర్స్ తమవైన అద్భుత చిత్రాలు రూపొందించాలి!’’ అంటున్నాడు కమల్ హాసన్. ‘ప్రేమమ్’ సినిమా దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ ఆ మధ్య కమల్ హాసన్ ‘దశావతారం’ ట్వీట్ కు స్పందించాడు. 13 ఏళ్లు పూర్తయ్యాయంటూ కమల్ ‘దశావతారం’ సినిమాని గుర్తు చేసుకోగా… డైరెక్టర్ అల్ఫోన్స్ ఆ సినిమాని ‘పీహెచ్ డీ’తో పోల్చాడు. అయితే, ‘దశావతారం’ పీహెచ్డీ కాగా…
సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రదర్శనలకు కేంద్రీయ చలన చిత్ర ధ్రువీకరణ సంస్థ (సి.బి.ఎఫ్.సి) జారీ చేసే ధ్రువపత్రాల అధికారం.. కేంద్రం అధీనంలోకి తీసుకుంటూ చట్టాన్ని రూపొందించాలన్న నిర్ణయంపై సినీ పరిశ్రమలో అసంతృప్తి రగులుతోంది. దీనిపై సినిమా ప్రముఖులు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే దీనిపై తమిళ స్టార్ హీరో సూర్య రీసెంట్ గా స్పందించారు. ఇది భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.…
కాంట్రవర్సీ ‘క్వీన్’ కంగనాకి కోర్టు కష్టాలు తప్పటం లేదు. ప్రతీ రోజూ ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేసే ముక్కుసూటి ముద్దుగుమ్మ ఇప్పుడు కాపీరైట్ కొట్లాటలో ఇరుక్కుంది. తాను ‘మణికర్ణిక రిటర్న్స్ : ద లెజెండ్ ఆఫ్ దిడ్డా’ పేరుతో సినిమా చేయబోతున్నట్టు కొన్నాళ్ల కింద కంగనా ట్వీట్ చేసింది. అయితే, తన పర్మిషన్ లేకుండా తన పుస్తకంలోని కథని వాడుకుంటున్నారని ఆశిష్ కౌల్ అనే రచయిత కోర్టుకు వెళ్లాడు. ఆయన కంగనాకి ఒక మెయిల్ చేయగా… అందులోని…
ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్యర్య వివాహం నేడు ఘనంగా జరుగుతోంది. క్రికెటర్ రోహిత్ దామోదరన్తో కలిసి ఆమె కాసేపటి క్రితమే ఏడడుగులు వేసింది. కరోనా కారణంగా మహాబలిపురంలో వీరి వివాహ వేడుకను నిరాడంబరం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరై.. నూతన వధువరులను ఆశీర్వాదించారు. ఈమేరకు వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.…
విజయ్ సోషల్ మీడియాలో పెద్దంతగా కనిపించడు. పబ్లిక్ ఫంక్షన్స్ కూ హాజరయ్యేది తక్కువే! ఎప్పుడో ఒకటి రెండు సార్లు మాత్రం అలా మెరుపులా మెరుస్తుంటాడు. కానీ అతని అభిమానులు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా కూడా అతని అభిమానులు ట్విట్టర్ స్పేస్ సెషన్ ఒకటి ఏర్పాటు చేసి, గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. విశేషం ఏమంటే… ఆ సెషన్ లో పలువురు హీరోయిన్లు కూడా పాల్గొన్నారు. అందులో…
తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వలిమై’. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ‘వలిమై’ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మిస్తున్నారు. హ్యుమా కూరేషి హీరోయిన్ గా నటిస్తుండగా.. టాలీవుడ్ నటుడు కార్తికేయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలావుంటే, ఇప్పటికే విడుదలైన పోస్టర్లను బట్టి చూస్తుంటే.. యాక్షన్ సినిమా అని తెలుస్తోన్నప్పటికీ.. మదర్ సెంటిమెంట్ కూడా ప్రధానంగా ఉండనుందట.. అంతేకాదు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ‘అమ్మ’పై ప్రత్యేకంగా స్వరపరిచిన ఓ…
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మరో అరుదైన కాంబినేషన్ కుదిరింది. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, వైవిధ్యభరిత చిత్రాల హీరో ధనుష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అభిరుచితో కొత్త తరహా సినిమాలు చేస్తూ అటు ఆడియెన్స్ ను ఇటు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో సినిమా వస్తుండటం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.ధనుష్ తో సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకుడు శేఖర్ కమ్ముల ట్వీట్ తో అనౌన్స్ చేశారు. తెలుగు,…
పలు తమిళ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన షమన్ మిత్రు (43) గురువారం ఉదయం కరోనాతో చెన్నయ్ లో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కోవిడ్ పరీక్ష చేయగా ఆయనకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దాంతో హాస్పటల్ లో చేర్చారు. అయితే ఆయన కరోనా నుండి బయటపడలేకపోయారు. భార్య, ఐదేళ్ళ కుమార్తె ఉన్న షమన్ మిత్రు మంచి నటుడు కూడా. 2019లో వచ్చిన ‘తొరత్తి’ చిత్రంలో షమన్ మిత్రు హీరోగా నటించడమే కాకుండా దానిని నిర్మించారు. గ్రామీణ…
ప్రముఖ దర్శకుడు శంకర్ తల్లి ముత్తు లక్ష్మి (88) మరణించారు. వయోభార సమస్యలతో ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి కోలీవుడ్తోపాటు ఇతర చిత్ర పరిశ్రమ ప్రముఖులూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన అభిమానులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం శంకర్ త్వరలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా, రణవీర్ సింగ్ హీరోగా మరో సినిమా చేయనున్నారు. కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 తెరకెక్కిస్తున్నారు.
కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. తాజాగా తమిళ నటుడు నితీశ్ వీరా కరోనాకు బలయ్యారు. ధనుష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అసురన్’లో పాండ్యన్ పాత్రపోషించి గుర్తింపు తెచ్చుకున్న నితీశ్ చెన్నైలోని ఒమందురార్ హాస్పిటల్ లో ఈ రోజు కన్నుమూశారు. ‘పుదుపేట్టై, వెన్నెల కబాడి కుళు, మావీరన్ కిట్టు’ సినిమాల్లో నూ గుర్తింపు ఉన్న పాత్రలను పోషించారు నితీశ్. ఇక రజనీకాంత్ ‘కాలా’లోనూ కనిపించిన నితీశ్ మరణం తమిళ చిత్రపరిశ్రమలో పెద్ద షాక్…