నటుడు సత్యరాజ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి, గాంగేయం మాజీ ఎమ్మెల్యే అర్జునన్ సతీమణి కల్పన కన్నుమూశారు. గతకొద్దికాలంలాగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందారు. దీంతో సత్యరాజ్ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఏ. కల్పన సత్యరాజ్ కి రెండో చెల్లెలు.. ఆమె తిరుప్పూరు జిల్లా గాంగేయంలో నివసిస్తున్నారు. చెల్లెలి మరణ వార్త విన్న సత్యరాజ్ కుటుంబం హుటాహుటిన తిరుప్పూరుకి చేరుకున్నారు. ఇకపోతే తమిళ్ నటుడిగా పేరు గాంచిన…
కారు రేస్, బైక్ రేస్ లపై చాలా సినిమాలు వచ్చాయి.. కానీ మొదటిసారి మడ్ రేస్ పై ఒక చిత్రం రాబోతోంది. నూతన దర్శకుడు డా. ప్రగాభల్ దర్శకత్వంలో యువన్, రిధాన్ కృష్ణ, అనూష సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మడ్డీ’.. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పూర్తి కావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా…
చిత్రపరిశ్రమలో మీటూ ఉద్యమం ఎంతటి ప్రళయాన్ని సృష్టించిందో అందరికి తెలుసు. హీరోయిన్లపై హీరోలు, దర్శకనిర్మాతలు లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని నిరసిస్తూ ఈ ఉద్యమం మొదలయ్యింది. ఈ మీటూ ఉద్యమంలో ఎంతమంది హీరోయిన్లు తాము ఎదుర్కొన్న వేధింపులు బహిరంగంగా చెప్పుకొచ్చారు. ఈ ఉద్యమం నడిచేటప్పుడే కోలీవుడ్ హీరోయిన్ శృతి హరిహరన్, స్టార్ హీరో అర్జున్ సర్జా తనను లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించింది. షూటింగ్ సమయంలో తనను అసభ్యంగా తాకుతూ, కౌగిలించుకోవడానికి ట్రై చేశాడని…
లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె నటించిన ‘పెద్దన్న’ విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. మరోపక్క నయన్, ప్రియుడితో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల నయన్ బర్త్ డే వేడుకలను విగ్నేష్ గ్రాండ్ గా చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలోనే నయన్ ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. స్టార్…
‘వాలి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు ఎస్.జె సూర్య.. ‘ఖుషీ’ చిత్రంతో టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి తిరుగులేని హిట్ ని ఇచ్చి పవన్ ఫ్యాన్స్ కి దేవుడిగా మారాడు. ఇక ఈ సినిమాలో నటుడిగా కూడా కనిపించిన ఈ దర్శకుడు ప్రస్తుతం నటుడిగానే కొనసాగుతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మానాడు’ చిత్రంలో సూర్య విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘లూప్’ పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ…
ప్రస్తుతం యువత ఆలోచనా విధానం మారుతోంది. తమకిష్టమైన వారితో, తమకిష్టమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నారు. దీనికోసం ఎవరినైనా ఎదిరిస్తున్నారు.. చివరికి సమాజాన్ని కూడా.. ప్రేమకు లింగం అడ్డుకాదు.. గే అయినా, లెస్బెనియన్ అయినా వారి భావాలకు తగ్గట్టు ప్రేమించే హక్కు వారికి ఉంటుంది. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం తప్పుకాదని న్యాయస్థానమే నిర్ణయించింది. అయినా సమాజంలో కొంతమంది వారిని అంగీకరించడంలేదు. అందులో సొంత తల్లిదండ్రులు కూడా పిల్లల భావాలను పట్టించుకోవడం లేదు.. తాజాగా…
యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. యూరప్ లో విక్రమ్ షూటింగ్ కోసం వెళ్లిన ఆయనకు కరోనా సోకడంతో షూటింగ్ నిలిపివేశారు. ప్రస్తుతం కమల్ హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇకపోతే కమల్ కొన్నిరోజులు రాకపోతే ఆయన నిర్వహిస్తున్న బిగ్ బాస్ పరిస్థితి ఏంటీ ..? అనేది ప్రస్తుతం తమిళీయులను తొలుస్తున్న ప్రశ్న.. అయితే దీనికి ఆన్సర్ దొరికేసిందని తెలుస్తోంది. కమల్ వచ్చేంత వరకు ఆయన స్థానాన్ని ఆమె…
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కొవిడ్ 19 బారిన పడ్డారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. అంతేకాదు ‘కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యే ఉందని, దానితో జాగ్రత్తగా ఉండాల’ని కమల్ హాసన్ సూచించారు. సోమవారం మధ్యాహ్యం కమల్ హాసన్ తాను హస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయాన్ని స్వయంగా ట్వీట్ చేశారు. ‘యూ.ఎస్. ట్రిప్ నుండి తిరిగి వచ్చాక కాస్తంత దగ్గు వచ్చిందని, పరీక్షలు నిర్వహించగా ఇన్ ఫెక్షన్ ఉందని వైద్యులు నిర్థారించారని అన్నారు.…
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిపై ఎయిర్ పోర్టులో దాడికి పాల్పడిన ఘటన గురించి అందరికి తెలిసిందే. ఒక ఆగంతకుడు అమాంతంగా విజయ్ సేతుపతిపై దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ సమయంలోనే విజయ్ సేతుపతిని తన్నిన వారికి ప్రతిసారీ రూ.1001 రివార్డ్‌గా చెల్లిస్తానని హిందూ మక్కల్ కట్చి నాయకుడైన అర్జున్ సంపత్ ప్రకటించడం సంచలనంగా మారింది. ప్రముఖ స్వాతంత్య్రోద్యమ వీరుడు అయ్యి తేవర్ ను విజయ్ సేతుపతి…