దళితులను తమిళ ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని నటి, బిగ్బాస్ బ్యూటీ మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దళితులను కించపరిచేలా మాట్లాడిన ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా మరో ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెకు పోలీసులు నోటీసులు పంపారు. కాగా, ఆమె హాజరు కాకపోయేసరికి అరెస్ట్ అవుతుందంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. నన్ను అరెస్ట్ చేయడం మీ కల..…
కోవిడ్ ఇబ్బందులు ఇంకా పూర్తిగా పోలేదు. థియేటర్లు తెరుచుకున్నా, షూటింగ్ లు కొనసాగుతున్నా కరోనా కలవరం అందర్నీ వేధిస్తూనే ఉంది. ఇప్పుడు అదే సమస్య సూర్య, కమల్ హాసన్ మధ్య కూడా వచ్చింది. మహమ్మారి ఎఫెక్ట్ తో కమల్ హాసన్ కొద్ది రోజులు తన చిత్రాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. అయితే, అందుక్కారణం హీరో సూర్య కావటమే కోలీవుడ్ లో చర్చగా మారింది. సూర్య ‘ఎతరుక్కుమ్ తునిందవా’ సినిమా చేస్తున్నాడు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా…
తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం చెన్నైలో ‘బీస్ట్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి తెలుగు సినిమాపై దృష్టి పెట్టనున్నాడు విజయ్. ఇదిలా ఉంటే గురువారం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చెన్నైలో విజయ్ సెట్ సందర్శించాడు.ఈ సందర్భంగా ధోనీ, విజయ్ కొద్దిసేపు ఏకాంతంగా సమావేశమయ్యారు. ధోని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సహచరులతో కలిసి చెన్నైలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్…
తమిళ యువ కథానాయకుడు శింబు కారణంగా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (పెఫ్సీ), తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ (టి.ఎఫ్.సి.సి.) మధ్య అగ్గి రాజుకుంది. దానికి శింబు నటిస్తున్న ‘వెందు తనిందదు కాడు’ సినిమా కారణం. శింబు గతంలో నలుగురైదుగురు నిర్మాతలతో చేసుకున్న ఒప్పందాన్ని నెరవేర్చకుండానే ఈ కొత్త సినిమాకు డేట్స్ కేటాయించాడు. దాంతో వాళ్ళంతా నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. మరీ ముఖ్యంగా శింబులో ‘ట్రిపుల్ ఎ’ మూవీ నిర్మించిన మైఖేల్ రాయప్పన్…
తమిళ నటి, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ను చెన్నై పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి షెడ్యూల్ కులాలకు చెందిన దర్శకులు, నటులను గెంటేయాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఓ దర్శకుడు తన అనుమతి లేకుండా తన ఫోటోను సినిమా ఫస్ట్ లుక్ కోసం ఉపయోగించాడని ఆరోపిస్తూ షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా అవమానకరమైన పదాలను ఉపయోగించింది. ‘తక్కువ జాతి అనగా దళిత సామాజిక వర్గానికి…
బిగ్బాస్ బ్యూటీ, ప్రముఖ తమిళ నటి మీరా మిథున్ కోలీవుడ్ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తమిళ పరిశ్రమలోని షెడ్యూల్డు కులానికి చెందినా డైరక్టర్లు, యాక్టర్లు, ఇతర నటులు అందరూ బయటకు వెళ్ళిపోవాలని కామెంట్స్ చేసింది. వారి కారణంగా పరిశ్రమలో క్వాలీటి సినిమాలు రావడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వారి పద్ధతి, వ్యవహారాలు బాగుండవని మీరా మిథున్ తెలిపింది. కాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై షెడ్యూల్డ్ కులాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. చెన్నై, కోయంబత్తూరు,…
సన్నీ లియోన్ థ్రిల్లింగ్ కెరీర్ కి మరో థ్రిల్లర్ మూవీ జతైంది. ఆమె తమిళ చిత్రం ‘షేరో’ షూటింగ్ పూర్తి చేసింది. చివరి రోజు ప్యాకప్ సందర్భంగా క్లాప్ బోర్డ్ తో సహా డైరెక్టర్ శ్రీజిత్ విజయన్ తో కెమెరాకు ఫోజిచ్చింది. అయితే, సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ ‘షేరో’లో ఆమె క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. ఈమేరకు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. భారతీయ మూలాలున్న అమెరికన్ లేడీగా సన్నీ కనిపించబోతోంది. ఇండియాకి వచ్చిన ఆమెకు…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటిస్తున్న ప్రతి సినిమాను తెలుగులోనూ విడుదల అయ్యేలా చూసుకుంటాడు. ప్రస్తుతం ఆయన కెరీర్ లో 39వ చిత్రంగా వస్తున్న “జై భీమ్” సినిమాను ఓటీటీలోనే విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా మేకర్స్ తెలియజేశారు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సూర్య గిరిజన సంఘాల హక్కుల కోసం, వారి భూమి కోసం…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2015లో ధనుష్ అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నందుకుగాను చెల్లించాల్సిన పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అదే సంవత్సరంలో ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ధనుష్ వేసిన పిటిషన్ను తాజాగా పరిశీలించిన హైకోర్టు.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని, పన్ను చెల్లించాల్సిందేనని హైకోర్టు ధనుష్ కు తేల్చిచెప్పింది. సామాన్య…
బ్యూటీ రాశిఖన్నా గ్లామర్ డోస్ పెంచేశాక ఒక్కసారిగా ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. ఇటు టాలీవుడ్ లోను, అటూ కోలీవుడ్ లోను సినిమాల జోరు చూపిస్తోంది. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన ‘థ్యాంక్యూ’ చేస్తున్న రాశి ఖన్నా, గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’లోను నటిస్తోంది. కోలీవుడ్ లోను ‘అరణ్మణై 3’, విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ సినిమాల షూటింగ్స్ ను పూర్తి చేసిన ఈ బ్యూటీ, తాజాగా కార్తీ ‘సర్దార్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారామె. ధనుష్…