సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాతే దీపావళి కానుకగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో పెద్దన్న గా విడుదల కానుంది. ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్, ఖూష్బూ, మీనా హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు కావడంతో తలైవా ఫ్యాన్స్ కి పండగ వాతావరణం మొదలైయిపోయింది.
రజినీ మూవీ అంటే ఫస్ట్ డే.. ఫస్ట్ డే పడాల్సిందే.. ఆరోజు స్కూల్ ఉందా.. ఆఫీస్ ఉందా..? ఇంట్లో పండగ ఉందా..? అనేది ఎవరు చూడరు.. నిర్మొహమాటంగా తలైవా సినిమాకు వెళ్తున్నాం.. లీవ్ ఇవ్వండి అంటూ రజినీ ఫ్యాన్స్ అడిగేస్తుంటారు. ఆ సాకు.. ఈ సాకు చెప్పి వారికి లీవ్ ఇవ్వడం కన్నా మనమే ఆరోజు లీవ్ ప్రకటించడం బెటర్ అనుకున్నారేమో ‘న్యూ వే హెల్త్‌కేర్ సర్వీస్’ అనే సంస్థ తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు అరపూట (హాఫ్ డే) సెలవును ప్రకటించింది. అంతేకాకుండా ఉద్యోగులందరికీ అన్నాతే టికెట్స్ ని కూడా బుక్ చేసి ఫ్రీ గా ఇచ్చేసింది. దీంతో ఆ ఉద్యోగాలందరు ఎగిరి గంతులు వేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మిగతా కంపెనీలోని ఉద్యోగులు మాక్కూడా ఈ ఆఫర్ ఇస్తే బావుండని అనుకుంటున్నారట. అయితే గతంలో కబాలి సినిమా విడుదల సమయంలోను ఈ సంస్థ ఇలాగె సెలవు ప్రకటించింది. ఎంతైనా తలైవా రేంజ్ అలాంటిది మరి..