ఇటీవల కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిపై ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. తాగిన మైకంలో ఒక వ్యక్తి విజయ్ సేతుపతి పీఏపై దాడి చేశాడు. అనంతరం అతడే క్షమించమని అడగడంతో ఈ గొడవ ముగిసింది. ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేయవద్దని సేతుపతి చెప్పడం చర్చనీయాంశంగా మారిన సంగతి కూడా విదితమే. ఇక తాజగా ఈ ఘటనపై విజయ్ సేతుపతి స్పందించారు.
“అది ఒక చిన్న ఘటన.. ఎయిర్ పోర్ట్ లో మేము వచ్చినప్పుడే ఆ గొడవ మొదలయ్యింది. నా వ్యక్తిగత సిబ్బందితో ఆటను తగిన మైకంలో ఘర్షణకు దిగాడు. మేము ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయ్యాక కూడా ఇది కొనసాగింది.దీంతో మేము వెళ్లిపోతుండగా అతడు వెనుక నుంచి వచ్చి దాడికి పాల్పడ్డాడు. కొద్దిసేపటికి అతడే సారీ అడిగి వెళ్లిపోయాడు. ఈ ఘటనను కొంతమంది ఫోన్ లలో వీడియో తీసి వైరల్ చేశారు. ఈ మధ్యకాలంలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫిల్మ్ మేకర్ లా ఫీల్ అవుతున్నారు”.. అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మీరెందుకు సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టుకోరు.. అని అడుగగా “నాకు చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టుకోవడం ఇష్టం ఉండదు.. నా స్నేహితుడు మాత్రమే నాకు తోడుగా ఉంటాడు. అతడు నాకు 30 ఏళ్లుగా తెలుసు.. అతడే నాకు ఇప్పుడు మేనేజర్. నేను అభిమానులను కలవడానికి, ఈ గొడవకు ఎటువంటి సంబంధం లేదు.. ఈ గొడవ వలన వారిని కలవనేమో అని సందేహపడక్కర్లేదు” అని చెప్పుకొచ్చాడు.