అభిమానులకు సినీ తారలు అంటే ఎంత ఇష్టమో.. వారికి కూడా అభిమానులంటే అంతే ప్రాణం. వారు చేసే ఎలాంటి సినిమాలైనా అభిమానుల కోసమేనని వారు ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్యాన్స్ కష్టాల్లో ఉంటె ఆదుకొంటారు.. వారు అకాల చెందితే వీరు బాధపడతారు. తాజాగా చెన్నై బ్యూటీ త్రిష కూడా అదే విషాదంలో ఉంది. త్రిష వీరాభిమాని అయిన కిషోర్ మృతిచెందాడు. దీంతో త్రిష గుండె ముక్కలయింది. బరువెక్కిన హృదయంతో ట్విట్టర్ ద్వారా తన వీరాభిమాని మృతికి సంతాపం తెలిపారు.
” నా గుండె బద్దలయ్యింది ఈ విషయం విని.. నీ ఆత్మకు శాటి చేకూరాలి సోదరా.. నాకెప్పుడూ తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు” అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం త్రిష.. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ నటిస్తుండగా.. భారతీయుడు 2 లో కూడా అమ్మడు ఒక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
I am so devastated about this💔 Rip my brother and thank you for being you. https://t.co/OUiTSXXtco
— Trish (@trishtrashers) November 14, 2021