కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- పూజా హెగ్డే జంట నటిస్తున్న చిత్రం ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే వారిని షాక్ కి గురిచేస్తూ సంక్రాంతికి కాకుండా సమ్మర్ లో ‘బీస్ట్’ వస్తున్నాడని మేకర్స్ ప్రకటించారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు…
అజిత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. ఎన్నో రోజులుగా ‘వాలిమై’ ట్రైలర్ ని రిలీజ్ చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసారు. ఇక తాజాగా ఆ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. హెచ్ వినోత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ మరియు బోని కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ రిలీజ్ అయ్యి నెట్టింట రికార్డులు సృష్టించాయి. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. హాలీవుడ్ యాక్షన్…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ‘అత్రంగి రే‘. ఇటీవల డిస్నీ హాట్ స్టార్ లో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమ కు ప్రస్తుతం వివాదాలు అంటుకున్నాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అంతగా ఈ సినిమాలో ఏముంది అంటే ఈ సినిమా లవ్ జిహాద్ ని ప్రోత్సహిస్తుంది అనే పాయింట్…
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒక పక్క సినిమాలలో నటిస్తూనే మరోపక్క బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. రౌడీ పిక్చర్స్ అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసిన ఈ జంట అందులో సినిమాలను నిర్మిస్తున్నారు. తాజాగా విగ్నేష్ దర్శకత్వంలో వసంత్ రవి నటించిన చిత్రం ‘రాకీ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక…
ఇటీవల కాలంలో ఇండియన్ స్ర్కీన్ పై బయోపిక్ ట్రెండ్ బాగా నడుస్తోంది. బడా బడా స్టార్స్ కూడా బయోగ్రాఫికల్ డ్రామాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ధనుష్ కన్ను కూడా ఈ బయోపిక్స్ పై పడింది. రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ధనుష్ ఇప్పటి వరకు ఎవరి బయోపిక్లో నటించ లేదు. అవకాశం లభిస్తే తను కూడా బయోపిక్లలో నటిస్తానంటున్నాడు ధనుష్. ఇటీవల తన సినిమా ‘అత్రంగి రే’ ప్రచారంలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు…
‘జెర్సీ’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్రద్దా శ్రీనాధ్. ఈ సినిమా తరువాత అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది కానీ, అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి. అయితే శ్రద్దా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి పెట్టింది పేరు. కన్నడ లో ఇప్పటికే ‘యూ టర్న్’ చిత్రంలో శ్రద్ద నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక తాజాగా మరోసారి శ్రద్దా శ్రీనాధ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. తమిళ్ లో కలియుగం పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో…
మాళవిక మోహనన్ .. అమ్మడి గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించి అటు కోలీవుడ్ లోనూ , ఇటు టాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకున్న ఈ భామ ఒకపక్క సినిమాలను చేస్తూనే .. మరోపక్క ఇదిగో ఇలా సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో విరుచుకుపడుతోంది. సోషల్ మీడియా లో అమ్మడి ఫాలోయింగ్ చుస్తే మెంటల్…
ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందని సంతోషపడేలోపు ఒమిక్రాన్ మళ్లీ ప్రజల మీదకు విరుచుకుపడుతోంది. ఇక ఈ వేరియంట్ భయంతో ఉన్న ప్రజలకు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడడం భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇటీవల స్టార్ హీరో కమల్ హాసన్ కోవిడ్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా మరో స్టార్ హీరో విక్రమ్ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో భాదపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు…
రజనీకాంత్ చిత్రసీమలో అడుగుపెట్టక ముందు బెంగళూరులో సిటీ బస్ కండక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో ప్రతి రోజూ సెకండ్ షో చూడడం ఆయనకు అలవాటుగా ఉండేదట. రజనీ మాతృభాష మరాఠీ. పెరిగిందేమో కర్ణాటక రాజధాని బెంగళూరులో. అయినా ఆయనకు తెలుగు నటులు యన్టీఆర్ సినిమాలంటే భలే ఇష్టం. యన్టీఆర్ ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రాన్నిబెంగళూరులో పలు మార్లు చూశానని చెబుతారు. అలాగే యన్టీఆర్ పౌరాణికాలంటే ఆయనకు ఎంతో అభిమానం. ఇక హిందీ నటుడు శత్రుఘ్న సిన్హా స్టైల్…
పలు పురస్కారాలతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దివంగత నటి, భరతనాట్య కళాకారిణి పద్మిని రామచంద్రన్ మనవరాలు లక్ష్మీ దేవి రూపొందిస్తున్న మ్యూజిక్ వీడియో ‘యదలో మౌనం’. ఇందులో నడిగర్ తిలకం శివాజీ గణేశన్ మనవడు దర్శన్, శ్రీదేవి మేనకోడలు శిరీష జంటగా కనిపించనున్నారు. శివాజీ గణేశన్, పద్మిని సుమారు 50 చిత్రాల్లో జంటగా నటించారు. ఇప్పుడు పద్మిని మనవరాలి దర్శకత్వంలో శివాజీ గణేశన్ మనవడు ఓ మ్యూజిక్ వీడియో చేయడం విశేషం. ఇందులో ఇంకా విఘ్నేష్…