లేడీ సూపర్ స్టార్ నయనతార కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఒక పక్క సినిమాలు మరోపక్క నిర్మాణ రంగంలో రాణిస్తున్న ఈ భామ ఈసారి బ్యూటీ రంగంలోకి దిగింది. తాజాగా రిటైల్ బ్రాండ్ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ఆమె అధికారిక ప్రకటన చేసింది. డెర్మటాలజిస్ట్ రేణిత రాజన్‌తో కలిసి నయన్ లిప్ బామ్ కంపెనీ ని మొదలుపెట్టినట్లు తెలిపింది. త్వరలోనే ఈ కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలను పంచుకొంటానని నయన్ పేర్కొంది. ఇకపోతే ప్రస్తుతం నయన్ కాత్తువక్కుల రెండు కాదల్, కనెక్ట్, గాడ్ ఫాదర్ చిత్రాల్లో నటిస్తోంది.