అనుకున్నంతా అయ్యింది! తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ‘వలిమై’ నిర్మాత బోనీ కపూర్ తన సినిమా విడుదలను వాయిదా వేశారు. నిజానికి సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించినప్పటి నుండే అందరిలోనూ ఇది వాయిదా పడే ఛాన్స్ ఉందనే అనుమానం కలిగింది. ఓ పక్క కరోనా కేసులు పెరగడంతో పాటు తమిళనాడులో రాత్రి కర్ఫ్యూ పెట్టడం, ఆదివారం లాక్ డౌన్ ప్రకటించడంతో సహజంగానే స్టార్ హీరో…
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సంక్రాంతి బరి నుండి తప్పుకున్నాడు. తన చిత్రం ‘సామాన్యుడు’ను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు. డెబ్యూ డైరెక్టర్ టి.పి. శరవణన్ రూపొందించిన ఈ యాక్షన్ డ్రామాను జనవరి 14న విడుదల చేయాలని తొలుత భావించారు. కానీ అనివార్యంగా ఈ మూవీ విడుదల 26కి వాయిదా పడింది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశాల్ దీనిని నిర్మించారు. డింపుల్ హయతి, యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా.…
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఒకటి నా పేరు శివ. తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకు సుసీంద్రన్ దర్శకత్వం వహించాడు. ఇక 2010లో రిలీజైన ఈ లవ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ కు సీక్వెల్ గా మరో కార్తీ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. పా. రంజిత్ దర్శకత్వంలో కార్తి –…
సంజనా గల్రాని.. బుజ్జిగాడు చిత్రంలో ప్రభాస్ తో ఆడిపాడిన బ్యూటీ.. ఆమద్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం.. ఆ తర్వాత పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టడం తో ఆమె కెరీర్ మసక బారినట్లయ్యింది. జీవులకు వెల్ళడం .. బెయిల్ పై బయటికి రావడం.. ప్రేమించినవాడిని పెళ్లాడడం వరకు అన్ని చకచకా జరిగిపోయాయి. ఇక వివాహమైన తరువాత అమ్మడు కొద్దిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం సంజనా ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. గత…
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన వసరం లేదు. ఆయనకు తెలుగులోనూ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక చియాన్ తనయుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు ధృవ్ విక్రమ్. టాలీవుడ్ లో సెగలు పుట్టించిన అర్జున్ రెడ్డి రీమేక్ ‘వర్మ’ చిత్రంతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన ధృవ్ మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అగ్రెస్సివ్ డాక్టర్ గా, ప్రేమ విఫలమైన ప్రేమికుడిగా ధృవ్ నటన ప్రేక్షకులను కదిలించింది. ఇక ఈ సినిమా తరువాత…
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా ఆరోగ్యం బాగోలేదని. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స తీసుకొంటున్నారని గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ వార్తలు నిజమో, కాదో తెలియకుండానే నెటిజన్లు ఇళయరాజా కోలుకోవాలని కామెంట్స్ పెట్టేస్తున్నారు. ఇక తాజాగా ఈ పుకార్లకు చెక్ పెట్టారు ఇళయరాజా.. ఎంతో చక్కగా తనదైన శైలిలో ఒక మధురమైన పాటను ఆలపిస్తూ అందరికి నూతన సంవత్సర శుబాకాంక్షలు తెలుపుతూ వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- పూజా హెగ్డే జంట నటిస్తున్న చిత్రం ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే వారిని షాక్ కి గురిచేస్తూ సంక్రాంతికి కాకుండా సమ్మర్ లో ‘బీస్ట్’ వస్తున్నాడని మేకర్స్ ప్రకటించారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు…
అజిత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. ఎన్నో రోజులుగా ‘వాలిమై’ ట్రైలర్ ని రిలీజ్ చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసారు. ఇక తాజాగా ఆ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. హెచ్ వినోత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ మరియు బోని కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ రిలీజ్ అయ్యి నెట్టింట రికార్డులు సృష్టించాయి. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. హాలీవుడ్ యాక్షన్…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ‘అత్రంగి రే‘. ఇటీవల డిస్నీ హాట్ స్టార్ లో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమ కు ప్రస్తుతం వివాదాలు అంటుకున్నాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అంతగా ఈ సినిమాలో ఏముంది అంటే ఈ సినిమా లవ్ జిహాద్ ని ప్రోత్సహిస్తుంది అనే పాయింట్…
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒక పక్క సినిమాలలో నటిస్తూనే మరోపక్క బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. రౌడీ పిక్చర్స్ అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసిన ఈ జంట అందులో సినిమాలను నిర్మిస్తున్నారు. తాజాగా విగ్నేష్ దర్శకత్వంలో వసంత్ రవి నటించిన చిత్రం ‘రాకీ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక…