RG Kar rape case: జైల్లో సంజయ్ రాయ్ కొత్త కోరిక.. ఏం అడిగాడంటే..!
- జైల్లో సంజయ్ రాయ్ కొత్త కోరిక
- పెన్, నోట్‌బుక్ ఇవ్వాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌కి ఇటీవల కోర్టు జీవితఖైదు విధించింది. ఆగస్టు 23, 2024 నుంచి ప్రెసిడెన్సీ సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు. ఇప్పటి దాకా అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న సంజయ్ రాయ్‌కి శిక్ష పడడంతో ఇకపై జైల్లో పని చేయాల్సి ఉంటుంది. పనుల్లో నైపుణ్యం లేని వాడు కాబట్టి అతనికి రోజుకి రూ.105తో కూడిన ఉద్యోగం ఇవ్వబడుతుందని జైలు అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే సంజయ్ రాయ్ జైలు అధికారులను ఒక కోరిక కోరాడు. తనకు పెన్, నోట్‌బుక్ ఇవ్వాలని అభ్యర్థించాడు. ఇక సంజయ్ రాయ్‌కి ప్రస్తుతం ఐదు దుప్పట్లు ఉన్నాయి. మరో మూడు అదనంగా కావాలని కోరాడు. దీనిపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక సెల్‌లో నడవడం, వ్యాయామం చేసుకునే వెసులబాటు ఉంది.
ఇది కూడా చదవండి: Hyderabad: గాంధీభవన్‌లో ఉద్రిక్తత.. కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
సంజయ్ రాయ్ ఆగష్టు 23, 2024 నుంచి ప్రెసిడెన్సీ జైల్లో ఉంటున్నాడు. వర్చువల్ లేదా ఫిజికల్‌గా కోర్టులో హాజరుపరిచే సమయంలో తప్ప మిగతా సమయంలో ఎప్పుడూ సెల్‌లోనే తాళం వేసి ఉంచారు. ప్రస్తుతం ప్రెసిడెన్సీ సెంట్రల్ జైల్లో ఖైదీలు తోటపని, వస్త్రాలు, ఫర్నిచర్, పఫ్డ్ రైస్, అల్యూమినియం పాత్రల తయారీ వంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. నైపుణ్యం లేని కార్మికులకు రూ.105, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.120, నైపుణ్యం కలిగిన కార్మికులు రూ.135 రోజువారీ వేతనం ఇస్తుంటారు. వేతనం.. ఖైదీ ఖాతాలో జమ అవుతుంటాయి. ఆ నగదు.. జైల్లో వస్తువులు కొనుగోలు చేసేందుకు ఉపయోగించొచ్చు. ఒకవేళ విడుదలైనప్పుడు డబ్బు తీసుకుని వెళ్లొచ్చు. సంజయ్ రాయ్ తోటపనిలో పాల్గొనవచ్చని సమాచారం.
ఆగస్టు 9, 2024న కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ కేసులో సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. తాజాగా న్యాయస్థానం కూడా దోషిగా తేల్చి జీవితఖైదు విధించింది. ఇదిలా ఉంటే ఈ తీర్పుపై బెంగాల్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది.
ఇది కూడా చదవండి: Mahakumbh 2025: మహా కుంభమేళాలో ముస్లిం మహిళలు.. సీఎం యోగిపై పొగడ్తల వర్షం..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..