Kodali Nani vs Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓపెన్ చాలెంజ్ విసిరారు.. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.. గన్నవరంలో చంద్రబాబు పర్యటన, అక్కడ బాబు చేసిన కామెంట్లపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు కొడాలి నాని.. నేను, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వస్తాం.. కొట్టుకుందాం.. నువ్వు రెడీనా బాబు? అని సవాల్ చేశారు.. అసెంబ్లీకి రాజీనామా చేసి వస్తాం.. ఎక్కడైనా ముగ్గురం కలిసి కొట్టుకుందాం.. చత్తీస్‌గఢ్, ఒడిశా అడవుల్లో కొట్టుకుందామా?…
Kodali Nani: గన్నవరం పాలిటిక్స్ కాకరేపుతున్నాయి.. మాటల తూటాలు, దాడులు, కేసుల వరకు వెళ్లింది వ్యవహారం.. ఇక, ఇవాళ గన్నవరంలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు, పోలీసులపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. ఇదే సమయంలో.. చంద్రబాబుకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.. చంద్రబాబు మైండ్ ఉండి మాట్లాడుతున్నాడా..? లేక బాలకృష్ణ పిచ్చి సినిమాలు చూసి పిచ్చెక్కిందా? అంటూ ఎద్దేవా…
పట్టాభి చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిప్పాలని చంద్రబాబు చూస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఎన్టీఆర్ ప్రజలను నమ్మి పార్టీ పెట్టారని.. కానీ ఎన్టీఆర్‌పై కుట్ర చేసి, నిందలు వేసి చంద్రబాబుని సీఎం చేశారని ఆయన అన్నారు.
Kodali Nani:నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాకరేపుతోన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతరులందరివీ కలిపి వెయ్యి ఫోన్లు ఉంటాయి.. అవన్నీ ఎవడు వింటాడు? అని ప్రశ్నించారు.. పార్టీ మారాలనుకున్నాడు.. ఇక్కడ మంత్రి పదవి అడిగితే ఇవ్వలేదు.. చంద్రబాబు ఇస్తానన్నాడేమో వెళ్లాడు అంటూ కోటంరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. పెగాసెస్ అలాంటి వన్నీ చంద్రబాబుకు అలవాటు.. మాలాంటి…
Kodali Nani: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులపై ఎవరివాదన వారిదే ఉంది.. ఇక, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల ఏపీకి చెందిన కొందరు నేతలు చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. వేర్పాటువాద ధోరణితో ఎవరైనా మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని హెచ్చరించారు. అవినీతిలో మునిగిపోయిన, పబ్లిక్ పాలసీ తెలియని మీరు రాష్ట్రా న్ని విడగొట్టేస్తారా.. మేం చూస్తూ కూర్చొంటామా? దేశభక్తులం.…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు టీఆర్ఎస్ను కాస్తా బీఆర్ఎస్గా మార్చేవారు గులాబీ పార్టీ బాస్ కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్‌పై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.. తోట చంద్రశేఖర్‌తో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు సహా మరికొందరు నేతలు బీఆర్ఎస్లో చేరనున్నారు.. మరోవైపు, ఏపీలోని 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని.. గెలిచేది కూడా తామేనని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. అంతేకాదు, పోలవరం, ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.. దీంతో,…