Off The Record: వంశీ, నానిలను ఢీకొట్టేది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ క్యాడర్ అంతా అక్కడ వారిద్దరూ ఓడిపోతే చూడాలని అనుకుంటోంది. పార్టీ నాయకత్వం మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమే మిగిలి ఉన్నా.. గట్టి అభ్యర్థి ఎవరో తమ్ముళ్లకు క్లారిటీ లేదు. ఇదే వైఖరి కొనసాగిస్తే వారిద్దరినీ మళ్లీ టీడీపీ గెలిపిస్తుందా? ఇదే అనుమానం పార్టీ కేడర్‌లోనూ ఉందా?
Also Read
టీడీపీకి కొరకరాని కొయ్యగా కొడాలి నాని, వల్లభనేని వంశీ
వచ్చే ఎన్నికల్లో గుడివాడ.. గన్నవరం నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగరాలని కోరుకుంటోంది పార్టీ కేడర్. ఇదే ఆ పార్టీకి పెద్ద టాస్క్. దానికి కారణం ఏంటో ప్రజలకు కూడా తెలుసు. కొద్దికాలంగా టీడీపీ నుంచి ఇలాంటి ప్రకటనలే వచ్చాయి. గుడివాడలో కొడాలి నాని.. గన్నవరంలో వల్లభనేని వంశీల ఓటమే టీడీపీకి టాప్ ప్రయారిటీ. కొన్నేళ్లుగా వీరిద్దరూ టీడీపీకి కొరకరాని కొయ్యగా మారడమే దానికి ప్రధాన కారణం. కొడాలి నాని, వంశీ ఇద్దరూ టీడీపీ నుంచే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అదే టీడీపీకి ప్రధాన రాజకీయ శత్రువులుగా మారారు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు.
టీడీపీని ఇరుకున పెట్టడమే పని..!
నాని గతంలో రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వైసీపీలో చేరి మరో రెండుసార్లు శాసనసభ్యుడయ్యారు. మొన్నటి వరకు మంత్రిగానూ చేశారు. వంశీ 2019 తర్వాత ప్లేటు ఫిరాయించారు. వీరిద్దరూ టీడీపీని.. చంద్రబాబును, లోకేష్‌ను ఏ విధంగా కార్నర్ చేస్తున్నారో చూస్తున్నాం. తమ మాటలతో.. చేతలతో ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టిన సందర్భాలు అనేకం. అందుకే ఈ రెండుచోట్లా నాని, వంశీలను ఓడించాలనే కసి తెలుగు తమ్ముళ్లలో నెలకొంది. టీడీపీ అధిష్ఠానం మూడ్ కూడా అలాగే ఉన్నప్పటికీ.. గుడివాడ, గన్నవరంలో క్షేత్రస్థాయి పరిస్థితులు మరోలా ఉన్నాయి.
గుడివాడ, గన్నవరంలో టీడీపీ ప్రత్యేక ఫోకస్
కొడాలి నాని తన మాటలతో టీడీపీపై విరుచుకుపడుతుంటే.. గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడుల వరకు వ్యవహారం వెళ్లింది. ఎన్నికలకు మరో ఏడాదే సమయం ఉండటంతో ఇక్కడ పార్టీ పెద్దలు ప్రత్యేక దృష్టి పెట్టారని.. బలమైన అభ్యర్థులను బరిలో దించుతారని.. ఇంఛార్జులు కూడా బలమైన నాయకులే ఉంటారని తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారు. ఇలా ఎదురు చూడటంలోనే రోజులు గడిచిపోతున్నాయి కానీ.. అధిష్ఠానం నుంచి ఉలుకు పలుకు లేదు. గుడివాడలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. గుడివాడలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఉన్నా.. మరికొందరు హడావిడి చేస్తున్నా.. వారే అభ్యర్థులని పార్టీ ప్రకటించలేని పరిస్థితి. నానిని ఢీకొట్టాలంటే నానికంటే బలమైన నాయకుడు కావాలని వెతకడంలోనే టీడీపీకి కాలం గడిచిపోతోంది. ఇది స్థానికంగా టీడీపీ కేడర్‌ను డైలమాలో పడేస్తుంటే.. అధికారపక్షం ఫుల్ జోష్‌లో ఉందట. ఎన్ని అనుకున్నా.. మరెన్ని శపథాలు చేసినా.. మళ్లీ టీడీపీనే గుడివాడలో నానిని గెలిపిస్తుందా అనే అనుమానాల్లో ఉన్నారట తెలుగు తమ్ముళ్లు.
గన్నవరంలో ఫలించని టీడీపీ ప్రయోగాలు
ఇక గన్నవరంలోనూ టీడీపీకి దిక్కు మొక్కు లేకుండా పోయింది. వరసగా రెండుసార్లు గెలిచిన వంశీని ఢీకొట్టడానికి టీడీపీ అనేక ప్రయోగాలు చేస్తోంది కానీ.. ఏదీ వర్కవుట్ కావడం లేదు. మొన్నటి వరకు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆయన అకాల మరణంతో ఆ పోస్టు కూడా ఖాళీ. అర్జునుడు సైతం గన్నవరంలో తనదైన ముద్ర వేయలేకపోయారనే అభిప్రాయం టీడీపీ శిబిరంలో ఉంది. ఇక్కడ టీడీపీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ.. వాళ్లను నడిపించే ఇంఛార్జే లేరని చర్చ సాగుతోంది. వంశీకి గన్నవరం వైసీపీలో వ్యతిరేకులు కూడా గట్టిగానే ఉన్నారు. ఇక్కడ రాజకీయ వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకోవాలని టీడీపీ అనుకుంటున్నా.. అందుకు తగ్గా కార్యాచరణ లేదు. ఇప్పటికీ ఇంఛార్జ్ ఎవరో తెలియదు.. వచ్చే ఎన్నికల్లో వంశీని గట్టిగా ఢీకొట్టే టీడీపీ అభ్యర్థి ఎవరో కూడా చెప్పలేకపోతున్నారు నాయకులు. ఇదే వైఖరి కొనసాగితే.. గన్నవరంలోనూ టీడీపీనే వంశీని గెలిపించేలా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గుడివాడ, గన్నవరంలో సిట్టింగ్‌లను ఓడించాలనే కసి ఉంటే సరిపోదని..దానికి తగ్గా ప్లాన్ కూడా ఉండాలనేది టీడీపీ పెద్దలకు తెలిసినా.. ఎందుకు లైట్ తీసుకుంటున్నారో తమ్ముళ్లకు అంతుచిక్కడం లేదట.
తాజావార్తలు
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!