Kodali Nani: గన్నవరం పాలిటిక్స్ కాకరేపుతున్నాయి.. మాటల తూటాలు, దాడులు, కేసుల వరకు వెళ్లింది వ్యవహారం.. ఇక, ఇవాళ గన్నవరంలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు, పోలీసులపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. ఇదే సమయంలో.. చంద్రబాబుకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.. చంద్రబాబు మైండ్ ఉండి మాట్లాడుతున్నాడా..? లేక బాలకృష్ణ పిచ్చి సినిమాలు చూసి పిచ్చెక్కిందా? అంటూ ఎద్దేవా చేశారు.. గన్నవరానికి పిచ్చోడు వచ్చాడని ప్రజలు చెబుతున్నారన్న ఆయన.. నేను, వల్లభనేని వంశీ వస్తాం.. నువ్వు రెడీ నా బాబు? అంటూ సవాల్ చేశారు.. అసెంబ్లీకి రాజీనామా చేసి వస్తాం.. ఎక్కడైనా ముగ్గురం కలిసి కొట్టుకుందాం.. ఛత్తీస్‌గఢ్, ఒడిశా అడవుల్లో కొట్టుకుందామా? ఎక్కడ కొట్టుకుందాం? చెప్పు.. పైకి పోదామా? జైల్ కు పోదామా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. సీడబ్ల్యూసీ ఎన్నికలు వద్దంటూ తీర్మానం
వైఎస్ జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం అయితే.. చంద్రబాబుది ఖర్జూర నాయుడు రాజ్యాంగమా? అంటూ సెటైర్లు వేశారు కొడాలి నాని.. మెంటల్ హాస్పిటల్ లో బాబు అండ్ బ్యాచ్‌ను వేయాలని సీఎం జగన్‌కు చెబుతామన్న ఆయన.. గూగుల్ టేక్ ఔట్ చెయ్యడానికి సీబీఐ ఎందుకు? వైఎస్ వివేకా హత్య కేసుకు సీబీఐ ఎందుకు టెలిఫోన్ ఆపరేటర్ చాలు? అని వ్యాఖ్యానించారు. వివేకా కేసులో సీబీఐ నాలుగు నెలలు ఏమి చేసింది.. గుడ్డి గుర్రానికి పళ్లు తొమిందా? అని ప్రశ్నించారు.. ఒక టెటిఫోన్ ఆపరేటర్ చాలు… గూగుల్ టేక్ ఔట్ అంటే ఎవరు ఎవరితో మాట్లాడారు.. ఎవరి ఫోన్ ఎక్కడుంది అనేది తెలిసే ప్రక్రియ అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని.. కాగా, టీడీపీ నేతలు, కార్యాలయాలపై ఒక ప్రణాళిక ప్రకారమే దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. మాపైనే దాడులు చేస్తూ, మా వాళ్లనే జైళ్లకు పంపిస్తున్నారని అన్నారు. సైకో ముఖ్యమంత్రి జగన్ కు వత్తాసు పలుకుతున్న పోలీసు అధికారులు జైళ్లకు వెళ్లక తప్పదని హెచ్చరించారు చంద్రబాబు.. ఇవాళ గన్నవరంలో పర్యటించిన చంద్రబాబు.. . రేపు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీలు వేసి ఒక్కొక్కరి సంగతి చూస్తాం.. జగన్ ను నమ్ముకున్న వాళ్లంతా జైళ్లకు వెళ్లారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.