Kodali Nani: పట్టాభి చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిప్పాలని చంద్రబాబు చూస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఎన్టీఆర్ ప్రజలను నమ్మి పార్టీ పెట్టారని.. కానీ ఎన్టీఆర్‌పై కుట్ర చేసి, నిందలు వేసి చంద్రబాబుని సీఎం చేశారని ఆయన అన్నారు. పట్టాభిని గన్నవరం ఎవరు పంపించారు… నేను, వంశీ రమ్మని చెప్పామా అంటూ నాని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్ ఎన్టీఆర్ కన్నా వైఎస్ జగన్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన వెల్లడించారు.
పోలీస్ వ్యవస్థపై అభాండాలు వేస్తూ కులాలు, మతాలు అంట గడుతున్నారని మండిపడ్డారు. బీసీ నాయకులపై దాడి జరిగిందని చంద్రబాబు, లోకేష్ అంటున్నారని.. గన్నవరంలో అరెస్ట్ అయిన బీసీ నేతల కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారా అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. లోకేష్ వివేకా హత్య కేసులో 40 కోట్ల డీల్ జరిగింది అని చెప్పాడని.. సీబీఐ కూడా నలభై కోట్ల డీల్ జరిగిందని చెప్పిందన్న నాని.. వివేకా హత్య కేసులో నలభై కోట్ల డీల్ జరిగినట్లు లోకేష్ ముందే ఎలా చెప్పారని ప్రశ్నించారు. సీబీఐని రాష్ట్రంలో బ్యాన్ చేసింది చంద్రబాబేనని అన్నారు. సీబీఐ వాళ్ళు చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తున్నారని ఆయన ఆరోపించారు. సీబీఐ, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేరన్నారు.
Read Also: TDP: టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ పక్కన పెట్టిందని.. అందుకే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు చిటికేస్తే లోకేష్ ఏమి చేస్తాడని ఎద్దేవా చేశారు. కొడుకుని చూసి చంద్రబాబు రగిలిపోతున్నాడని చెప్పారు. చంద్రబాబు అసెంబ్లీలో దేని కోసం ఏడ్చాడంటూ ప్రశ్నించారు. చంద్రబాబు భార్య కోసం బయట.. కొడుకు కోసం లోపల ఏడుస్తాడని ఈ సందర్భంగా కొడాలి నాని వ్యాఖ్యానించారు.