కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ నీ, రాజ్యాంగాన్ని ఏ విధంగా అవహేళన చేసిందో మోడీ ప్రజల ముందు పెట్టారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. వారం రోజులు నుండి రేవంత్ రెడ్డీ కి ఏమయిందో ఏమో కానీ ఆయన వ్యవహార శైలి ఆందోళన కరంగా ఉందన్నారు. అయన నిజస్వరూపం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, రేవంత్ రెడ్డి పరిస్థితి దిగజారింది.. అపరిపక్వంగా , అహంకారం తో మాట్లాడుతున్నారన్నారు. సీఎం…
ములుగు జిల్లాలో విషాదం.. నదిలో మునిగి బాలిక మృతి ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎండలు తాళలేక తండ్రి, కూతురు గోదావరి స్నానానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా తండ్రి నదిలో మునిగిపో సాగాడు. దీంతో భయాందోళన చెందిన కుమార్తె నిఖిత (14) సాయం చేసేందుకు.. తన తండ్రికి చెయ్యి అందించబోయింది. అంతే ప్రమాదశాత్తు గోదావరిలో మునిగిపోయి ప్రాణాలు వదిలింది. తండ్రి రాజేందర్ మాత్రం ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. మంగపేట (మం) కమలాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.…
ఈ ఎన్నికల్లో మోడీకే వేస్తామని ప్రజలు అంటున్నారు… దేశ భవిష్యత్, మా భవిష్యత్ ముఖ్యం అని అంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ జహీరాబాద్లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలకు గ్రామాలు తీర్మానం చేసుకుంటున్నాయని, బీజేపీ బలపడుతుంటే కాంగ్రెస్, BRS గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి మీ పార్టీ వల్ల బీసీ లకు అన్యాయం జరుగుతుంది… గ్రేటర్ కార్పొరేషన్…
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దేశ భద్రతకు ప్రమాదమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నీ ఒక జోకర్ లెక్క ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. శాంతియుత వాతావరణం చెడ గొట్టాలని చూశారు… ఘర్షణలు జరగాలని అనుకున్నారని, ఒక సీఎం, ఒక మాజీ సిఎం బాగా దొరికారన్నారు కిషన్ రెడ్డి. సీఎం పేగులు మెడలో వేసుకుంటా అంటాడు… మాజీ సిఎం కళ్ళు పీకి గోళీలు ఆదుకుంటాడు అట.. వాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి…
Kishan Reddy: కుటుంబాల తోక పట్టుకుని వేలాడే పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి అద్భుతమైన స్పందన వస్తుందన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండలేకపోతుందని ఆరోపించారు. మేము మా కుటుంబం మాత్రమే దేశాన్ని పరిపాలించాలి అనే దుర్మార్గపు ఆలోచనతో సోనియా గాంధీ ఉందని పేర్కొన్నారు. మరోవైపు.. రాహుల్ గాంధీ జోడో యాత్రను ప్రజలు పట్టించుకోలేదని అన్నారు. రాహుల్ గాంధీ చేసింది భారత్ జోడో యాత్ర కాదు తోడో యాత్ర అని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ…
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు నియోజకవర్గా్ల్లో కీలక నేతలు జెండాలు మారుస్తున్నారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు వలసల బాట పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు హస్తం గూటికి చేరుకోగా మరి కొందరు కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నియమించిన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
కాంగ్రెస్ దిగజారి ప్రకటనలు చేస్తుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగిస్తుందని, ఇటలీకి చెందిన సోనియా గాంధీని దేశ ప్రధాని చేయాలని చూశారన్నారు. మా పార్టీ సోనియా ప్రధాని కావడాన్ని అడ్డుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ మారిందని ఆయన విమర్శించారు. ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ అని, దేశానికి పట్టిన…