Kishan Reddy : మాకు తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ కావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుర్మార్గమైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు చెరో వైపు సత్తా లేక పిరికిపందాల్ల బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజలు నవ్వుకుంటున్నారని, రేవంత్, రాహుల్, కెసిఆర్ ల సర్టిఫికెట్ బీజేపీ కి అవసరం లేదన్నారు కిషన్ రెడ్డి. మాకు తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ కావాలని, మోడీ లేని భారతాన్ని చూడలేమన్నారు. ఎవరు బాధపడ్డ తెలంగాణ అభివృద్ధి కి కమిట్ మెంట్ తో పనిచేస్తామన్నారు. గాడిద గుడ్డు ను నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి కి సిగ్గుండాలని, 9 లక్షల కోట్లకు పైగా తెలంగాణ కోసం కేంద్రం ఖర్చు చేసిందన్నారు కిషన్ రెడ్డి.
మిడిమిడి జ్ఞానం తో రేవంత్ రెడ్డీ ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ తెలంగాణ ను సర్వనాశనం చేస్తుంది… ఆ పార్టీ అవినీతికి పాల్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.హైకమాండ్ ఆదేశాలతో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలను కలిశామన్నారు. కాంగ్రెస్‌కు విమర్శించడానికి ఏమీలేకనే దుష్ప్రచారాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. రిజర్వేషన్ల అంశంపైనా కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేసిందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాటలను ఏ ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. రిజర్వేషన్ల అంశంపై డైరెక్ట్ చేసిన రాహుల్ గాంధీ సినిమా ఫ్లాప్ అయిందన్నారు. కాంగ్రెస్.. సెకండ్, థర్డ్ ప్లేస్ వస్తుందని భావించి.. రేవంత్ రిజర్వేషన్ల అంశాన్ని ప్రచారం చేస్తున్నారన్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!