Kishan Reddy : అబద్ధాల్లో కేసీఆర్, రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీనీ గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు… మేము వారి దగ్గర వెళ్తే అదే మాట చెబుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్ ల ద్వారా లబ్ధి పొందుతున్న వారే బీజేపీ కి ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం నమ్మడం లేదు… నవ్వుకుంటున్నారని, ఎవరు కూడా ఆందోళన లు చేయలేదన్నారు కిషన్ రెడ్డి. సీఎం బాధ్యతారాహితమైన కామెంట్… శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా మాట్లాడారని, మోడీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ రిజర్వేషన్ ల అంశం ఎవరు సీరియస్ గా తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. అత్యధిక సీట్లు బీజేపీ గెలువబోతుంది… ప్రజలు భరోసా ఇస్తున్నారు . మీరు టెన్షన్ పడకండి అని చెబుతున్నారని, కాంగ్రెస్ పార్టీ కి కలవరం పెరిగిపోతుంది… సీఎం లో అసహనం పెరిగిపోతోందన్నారు. తన స్థాయి నీ మరచి మాట్లాడుతున్నారు.. ఇంకా సీఎం ను అని అనుకోవడం లేదని, రిపోర్టర్ లను జైల్లో పెట్టాలి అట… ఆయనకు ఎంత అహంకారం, గర్వం ఉందో అర్థం అవుతుందన్నారు.
అంతేకాకుండా..’టాక్స్ వసూలు చేసే చేతలు ఉన్నాయి కానీ… తెలంగాణ ప్రజలకు మేలు చేసే చేతలు లేవు. టిట్ల కోసం ఒక రీసర్చ్ టీమ్ ను పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి…. టీఆర్ఎస్ కేంద్రం తో ఘర్షణ పడ్డందుకే తెలంగాణ కు అన్యాయం జరిగింది అని అన్నారు… కేంద్రం తో సఖ్యత తో ఉంటా అని ఇప్పుడు గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎన్నికలు రాగానే ఏం రోగం పుట్టింది. స్వార్థం కోసం తెలంగాణ కు అన్యాయం చేస్తున్నారు. బీజేపీకి సానుకూల వాతావరణ కనిపిస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారు. కేసీఆర్ కుటుంబం, రేవంత్ రెడ్డి బీజేపీ పై అబద్ధాలు చెప్పడం లో పోటీ పడుతున్నారు. మోడీ తన కంఠం లో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్ లు పటిష్టంగా అమలు చేస్తామని అంటున్నారు… కేసీఆర్ తప్పు వల్ల కృష్ణ జలాల్లో తెలంగాణ నష్టం పోయింది… పది సంవత్సరాలు గా లేనిది కృష్ణ, గోదావరి లని తన చేతిలో కేంద్రం పెట్టుకుంటుంది అట.. కేసీఆర్ ఉద్యమం చేస్తారు అట.. అబద్ధాల్లో కెసిఆర్, రేవంత్ రెడ్డి కి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు.. రేవంత్ రెడ్డి ఎన్నికల తరవాత కూడా చర్చకు సిద్ధం.. ఎన్నికల తర్వాత నేను ఏమవుతానో తెలియదు కానీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు గా చర్చకు వస్తా.. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయక.. రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు రైతుల మీద పెట్టారు.. అది ఆయన గుడ్డా గాడిద గుడ్డ రేవంత్ రెడ్డి చెప్పాలి’ అని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
తాజావార్తలు
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?