PM Modi: రేపు వేములవాడలో మోడీ పర్యటన.. 1200 మందితో భారీ భద్రత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. ఈనేపథ్యంలో.. రేపు వేములవాడలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మద్దతుగా ప్రధానమంత్రి మోడీ వేములవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బుధవారం రోజున ఉదయం 8 గంటలకు రాజన్నను మోడీ దర్శించుకోనున్నారు. ఉదయం 9 గంటలకు వేములవాడ శివారులోని బాలనగర్ వద్ద బహిరంగ సభలో నరేంద్ర మోడీ పాల్గొంటారు. వేములవాడ రాజన్నను దర్శించుకునే తొలి ప్రధాని మోడీగా నిలిచారు. గుడి చెరువులో హెలిపాడ్ ను అధికారులు సిద్ధం చేశారు. 1200 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు పోలీసులు చేస్తున్నారు.
Read also: Faima : జబర్దస్త్ షో ఫుడ్ గురించి ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Also Read
- Vivek Venkataswamy: చెన్నూరుకు మహర్దశ.. రూపురేఖలు మారుస్తా.. మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతా
- Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
- OTR: యాక్టివ్ మోడ్‌లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
మోడీ రానున్న నేపథ్యంలో వేములవాడ పట్టణం కేంద్ర భద్రత సిబ్బంది చేతుల్లోకి వెళ్లింది. మోడీ వెళ్ళే రహదారిలో వెళ్లే ఇంటి నెంబర్లు, ఇంట్లో వారి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఈరెండు రోజులపాటు డ్రోన్లు కూడా పోలీసులు నిషేధించారు. ఖిలావరంగల్ మండలం లక్ష్మీపురంలో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. గతంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్‌లో పర్యటించగా, తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని హోదాలో ఉన్న నేత వరంగల్ కు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Lok Sabha Elections 2024: మూడో దశ ఓటింగ్ లో ఆద్మీ-కాంగ్రెస్ పొత్తు కలిసొచ్చేనా..?
తాజావార్తలు
-
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
-
India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
-
Vivek Venkataswamy: చెన్నూరుకు మహర్దశ.. రూపురేఖలు మారుస్తా.. మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతా
-
Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్‌ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!