Kishan Reddy: నేను ధైర్యంగా చెప్తున్నా తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. స్వాత్యంత్రం వచ్చాక 2014 వరకు అనేక ఉగ్ర దాడులు జరిగాయన్నారు. MoS హోం గా నేను పని చేశాను.. యూటీ లతో పాటు పది రాష్ట్రాలకు ఇంచార్జ్ గా ఉన్నానని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నామని మోడీ, అమిత్ షా, కొందరు అధికారులకు నాకు మాత్రమే తెలుసన్నారు. జమ్మూ కాశ్మీర్ లో 42 వేల మంది పాకిస్థాన్ కారణంగా చనిపోయారన్నారు. హైదరాబాద్ తో సహా అన్ని ప్రాంతాల్లో ISI కి నెట్వర్క్ ఉండేదన్నారు. మోడీ వచ్చాక దేశంలో ISI లేకుండా చేశామన్నారు. పాకిస్థాన్ ని టెర్రరిస్ట్ దేశంగా చేసి.. ప్రపంచంలో ఏకాకిని చేశామని తెలిపారు. ఏ దేశాలు కూడా పాకిస్థాన్ కు సహాయం చేయకుండా చేశామన్నారు.
Read also: NBK 109: బాలయ్య సినిమా యూకే రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్..
మన కరెన్సీని ఇతర దేశాలు ముద్రించి ISI ద్వారా ఇండియాలో చలామణి చేశారన్నారు. ISI ను దెబ్బతీయడంలో పెద్ద నోట్ల రద్దు కూడా ఒక భాగమే అని తెలిపారు. బ్రెడ్ ముక్క, బియ్యం కోసం పాకిస్థాన్ లో కొట్టుకుంటున్నారని తెలిపారు. పాకిస్థాన్ లో రోజు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లీడర్స్ చనిపోతున్నారు.. ఎవరు చంపుతున్నారో కూడా ప్రపంచ దేశాలకు తెలియడం లేదన్నారు. భారత్ ను దెబ్బ తీయాలని చూసిన టెర్రరిస్టులంతా చనిపోతున్నారని అన్నారు. పాకిస్థాన్ వాళ్లు చంపే వాళ్లు.. మనం చనిపోయే వాళ్లం అనే భావన్ ఉండేదన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు వరకు జమ్మూ కాశ్మీర్ కు ఒక ప్రధాని.. ఇండియాకు ఒక ప్రధాని ఉండేవారన్నారు. జమ్మూ కాశ్మీర్ లో మొన్నటి వరకు జిన్నా రాజ్యాంగం ఉండేదని తెలిపారు.
Read also: Delhi High Court: బిన్ లాడెన్ ఫొటో, ఐసిస్ జెండాలు ఉన్నంత మాత్రాన టెర్రిరిస్ట్‌గా పిలవలేం..
ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో భారత రాజ్యాంగాన్ని అమలు చేసి హక్కులను కాపాడుతున్నామన్నారు. భయంకరమైన ఆర్టికల్ 370 ని మోడీ రద్దు చేశారన్నారు. ఒక్క రక్తపు బొట్టు చిందకుండా ఆర్టికల్ 370 ని రద్దు చేశామన్నారు. శ్రీనగర్ లాల్ చౌక్ లో జాతీయ జెండా ఎగరాలని పెద్దల కోరిక ఉండేది.. ఇప్పుడు లాల్ చౌక్ లో జాతీయ జెండా ఎగురుతుందన్నారు. ముప్పై మూడేళ్ల తరువాత జమ్మూ కాశ్మీర్ లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించామన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లిన అద్భుతమైన రోడ్లు వేసామన్నారు. హైదరాబాద్ చుట్టూ RRR నిర్మాణం జరుగుతుంది.. RRR గేమ్ చేంజర్ కానుందన్నారు. రిజర్వేషన్ తీస్తే దేశంలో ఎన్నో గొడవలు జరుగుతాయన్నారు. రిజర్వేషన్స్ తీసేస్తే పరిస్థితి మన చేతుల్లో ఉండదన్నారు. మొన్నటి వరకు బీజేపీ, BRS సీట్లు పంచుకుంది అన్నాడు.. ఇప్పుడు రిజర్వేషన్స్ అంటున్నాడని మండిపడ్డారు. రేవంత్ కు ఏం దొరకక ఏదో ఒకటి ప్రచారం చేయాలని చేస్తున్నాడన్నారు.
Read also: AP Elections 2024: ఎన్నికల ప్రచారం.. మాజీ మంత్రి భార్య తీవ్ర ఆవేదన..
పది లక్షల కోట్ల అభివృద్ధి రేవంత్ కు గాడిద గుడ్డు లాగా కనిపిస్తుందన్నారు. రేవంత్ ముఖ్యమంత్రి అనే ఆలోచన లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని తెలిపారు. ఎలక్షన్స్ కోసం నన్ను మోడీని పార్టీని అంటున్నాడు రేవంత్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ స్థాయిని మరిచి.. దిగజారి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రేవంత్ తప్ప పార్టీలో ఎవరూ మాట్లాడటం లేదన్నారు. మిత్రులు ఇద్దరు ఒక్కటయినట్టున్నారు.. RR టాక్స్ వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో స్కూల్స్ బిల్డింగ్స్ కు కలర్ వేసే పరిస్థితి లేదు.. కేసీఆర్ అంతే చేశాడు.. రేవంత్ అదే చేస్తున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్మా సిటీని రద్దు చేయాలని చూశాడు.. కంపెనీస్ వెళ్లి మాట్లాడాగానే ఎంత ఇస్తారు అని డీల్ మాట్లాడాడన్నారు. నేను ధైర్యంగా చెప్తున్నాను తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్స్ వస్తాయన్నారు. 13న ఓటు హక్కును వినియోగించుకోవాలని అందరికి చెప్పాలని కోరుతున్నానని తెలిపారు.
AP Elections 2024: ఎన్నికల ప్రచారం.. మాజీ మంత్రి భార్య తీవ్ర ఆవేదన..