యునైటెడ్ కింగ్‌డమ్ రాజు చార్లెస్ (76) ఆస్పత్రిలో చేరారు. కేన్సర్ చికిత్సలో భాగంగా ఆస్పత్రిలో చేరినట్లుగా బకింగ్‌హామ్ ప్యాలెస్ గురువారం ప్రకటించింది. కేన్సర్ చికిత్స కారణంగా ఏర్పడిన దుష్పరిణామాల నేపథ్యంలో ఆస్పత్రిలో చేరినట్లుగా పేర్కొంది.
బ్రిటన్ రాజు పర్యటన అంటే ఎంతో హడావుడి.. హంగామా ఉంటుంది. అలాంటిది బ్రిటన్ రాజు చార్లెస్ దంపతులు భారత్‌లో పర్యటిస్తున్నారంటే ప్రొటోకాల్ ప్రకారం భారీ బందోబస్తు.. పోలీసుల హడావుడి ఉంటుంది. అలాంటిది చార్లెస్ దంపతులు గత వారం నుంచి దక్షిణ భారత్‌లోని బెంగళూరులో ఉంటున్న సంగతి ఎవరికీ తెలియలేదు.
లండన్‌లో జరిగిన ఎన్నికల్లో లేబర్ భారీ ఘనవిజయం నమోదు చేసింది. దాదాపు 400 సీట్లకు పైగా గెలుచుకుంది. దీంతో ప్రధాన మంత్రిగా కీర్ స్టార్మర్ ఎన్నికయ్యారు అలాగే కింగ్ ఛార్లెస్-3 కూడా కీర్ నియామకాన్ని ఆమోదించారు.
లండన్‌లో లేబర్ పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది. కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి అయ్యారు. అనంతరం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్-3ని కలిశారు. కింగ్ ఛార్లెస్-3... కీర్ స్టార్మర్నియామకాన్ని ఆమోదించారు.
బ్రిటీష్ సామ్రాజ్యంలో 70 ఏళ్ల తర్వాత తొలి పట్టాభిషేకం జరిగింది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో రాజ పట్టాభిషేకం ఇవాళ ఘనంగా జరిగింది. బ్రిటన్ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్‌కు వందల ఏళ్లనాటి సంప్రదాయాలను అనుసరించి కిరీటధారణ జరిగింది.
King Charles Coronation: కింగ్ ఛార్లెస్-3 పట్టాభిషేకానికి బ్రిటన్ సిద్దం అయింది. విదేశాల నుంచి వచ్చే ప్రముఖులు, రాజకుటుంబీకుల మధ్య ఈ రోజు ఆయన పట్టాభిషేకం అట్టహాసంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి భారతదేశం తరుపున ఉపరాష్ట్రపతి జగధీప్ ధన్ ఖడ్ హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కింగ్ ఛార్లెస్-3, ఆయన భార్య రాణి కెమ�
కింగ్ చార్లెస్ III చిత్రాన్ని కలిగి ఉన్న కరెన్సీ నోట్లు 2024 మధ్య నాటికి చెలామణిలోకి రానున్నాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ మంగళవారం వాటి డిజైన్లను ఆవిష్కరించింది. 5, 10, 20, 50 పౌండ్ల పాలిమర్ నోట్లపై డిజైన్‌పై కింగ్ చార్లెస్ ఫోటోను ముద్రించనున్నారు.
లండన్‌లోని యార్క్ నగరాన్ని సందర్శించిన కింగ్ చార్లెస్ III, క్వీన్ కన్సార్ట్ కెమిల్లాపై దుండగులు కోడిగుడ్లు విసిరారు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించే ప్రజల సంస్థ అయిన ప్రాజెక్ట్ జీరో వాల్తామ్స్టోవ్ను సందర్శించడానికి బ్రిటన్ చక్రవర్తి చార్లెస్-3 ఇటీవల తూర్పు లండన్‌కు వెళ్లారు. లోపలికి వెళుతున్నప్పుడు ఆయన బార్న్ క్రాఫ్ట్ ప్రైమరీ స్కూల్ పిల్లలతో కబుర్లు చెప్పారు.
41 ఏళ్ల నాటి ఓ కేక్ ముక్కను వేలం వేయనున్నారు. నాలుగు దశాబ్దాల నాటి కేక్ ముక్కను దక్కించుకోవడానికి ఎంతో మంది ఎదురుచూస్తున్నారు అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది మరి.